For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5G War: జియోకు పోటీగా టీసీఎస్..! అకస్మాత్తు నిర్ణయంతో రెండు డివిజన్ల సృష్టి.. రియల్ 5జీ వార్ స్టార్ట్..

|

ఏ వ్యాపారమైనా టాటాలు దిగనంత వరకే. ఈ మాట రతన్ టాటా నేతృత్వంలో అనేక సార్లు కంపెనీ నిజమని రుజువు చేసింది. తాజాగా టాటాలకు చెందిన ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు రెండు కొత్త విభాగాలను సృష్టించటం సంచలనంగా మారింది. ఎందుకంటే అవి 5జీ సేవలకు సంబంధించినవి కాబట్టి.

కొత్త విభాగాలు..

కొత్త విభాగాలు..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెలికాం, 5G సొల్యూషన్స్ అనే కొత్త విభాగాలను సృష్టించింది. వీటి కోసం అధిపతిగా ఇద్దరు కీలక వ్యక్తులను సైతం నియమిస్తుంది. చంద్రశేఖరన్ నేతృత్వంలో టాటా సన్స్ టీసీఎస్ కొత్త శిఖరాలకు చేరుకునేందుకు అడుగులు వేస్తోంది.

NSS విభాగం..

NSS విభాగం..

TCS 5G సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంజనీరింగ్ సేవలను అందించడానికి తన కమ్యూనికేషన్స్, మీడియా విభాగంలో నెట్‌వర్క్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ యూనిట్‌ను సృష్టించింది. నెట్‌వర్క్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ విభాగానికి విమల్ కుమార్ నేతృత్వం వహిస్తారని కంపెనీ వెల్లడించింది.

 CEN విభాగం..

CEN విభాగం..

కాగ్నిటివ్ ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్ యూనిట్ (CEN) అనే మరో యూనిట్‌ను ఈ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ గ్రోత్ గ్రూప్ సృష్టించింది. ఈ సెగ్మెంట్ కింద ఇంటెలిజెంట్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సేవలను అందించనుంది. ఈ విభాగాన్ని సత్య పిట్టా నిర్వహిస్తారని తెలుస్తోంది.

 5G సర్వీసెస్..

5G సర్వీసెస్..

ఆదాయం పరంగా టీసీఎస్ దేశంలోని ఐటీ కంపెనీల్లో అతి పెద్దదిగా ఉంది. అయితే కంపెనీ ప్రస్తుతం 5G సేవలు, నెట్‌వర్క్, ఇతర సంబంధింత వ్యాపారాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. టెలికాం కంపెనీలు ఈ కొత్త టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టటంతో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటాలు సిద్ధమయ్యారు.

BSNL 4G..

BSNL 4G..

ఇదే క్రమంలో దేశంలో ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4G సేవను పరిచయం చేయడానికి TCS ఒప్పందం చివరి దశలో ఉంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.16 వేల కోట్లుగా ఉంది. అదేవిధంగా TCS, Tejas Networks కూటమి ఈ రెండు కంపెనీల ద్వారా ప్రపంచంలోని కంపెనీలకు 5G రంగ సేవలను అందించగలదని నిపుణులు అంటున్నారు.

కంపెనీకి కలిసొచ్చే విషయాలు..

కంపెనీకి కలిసొచ్చే విషయాలు..

విమల్ కుమార్ టెలికాం రంగంలో అనేక భారీ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీసీఎస్ సీవోవో గణపతి సుబ్రమణియన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. మరో విభాగానికి ఎంపికైన సత్య పిట్టా కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్స్ (CBO) హెడ్ అశోకా భాయ్ ఆధ్వర్యంలో పని చేస్తారు. వీరిద్దరూ 1993 నుంచి టీసీఎస్ కంపెనీలోనే పనిచేస్తున్నారు.

జియోకు పోటీ తప్పదా..?

జియోకు పోటీ తప్పదా..?

టాటాల అరంగేట్రం దేశీయ టెలికాం దిగ్గజం జియోకు రానున్న కాలంలో గట్టి పోటీని ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 5జీ సేవలు లాంచ్ అయి రెండు రోజులు కూడా గడవక ముందే టాటాల నుంచి ప్రకటన రావటం హీట్ పెంచుతోంది. పోటీ తారాస్థాయికి చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు.

Read more about: tcs jio telecom business news
English summary

5G War: జియోకు పోటీగా టీసీఎస్..! అకస్మాత్తు నిర్ణయంతో రెండు డివిజన్ల సృష్టి.. రియల్ 5జీ వార్ స్టార్ట్.. | tcs company entering into 5g services in india announced two new telecom units may shock jio soon

tcs company entering into 5g services in india announced two new telecom units may shock jio soon
Story first published: Monday, October 3, 2022, 16:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X