TCS News: టెక్ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్.. కోట్ల కాంట్రాక్ట్ రద్దు.. భేజారిన షేర్ ధర..
TCS News: దేశంలోని అతిపెద్ద టెక్ సేవల కంపెనీ టాటా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యాపార పరంగా పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది. బిలియన్ డాలర్ల డీల్ చేజారిపోయింది.
కంపెనీ 2017లో ట్రాన్సామెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో 10 ఏళ్ల కాలానికి సేవలు అందించేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత స్థూల ఆర్థిక వాతావరణం కారణంగా గడుపు పూర్తయ్యేలోపు దీనిని ముగించుకున్నట్లు వెల్లడించింది. ట్రాన్సామెరికా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఇతర ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ క్రమంలో సేవలను ముగించాలని రెండు సంస్థలు పరస్పరం అంగీకరించాయని ప్రకటనలో టీసీఎస్ తెలిపింది.

టెక్ దిగ్గజం వెల్లడించిన వివరాల ప్రకారం TCS, Transamerica ఇన్సూరెన్స్ మధ్య ఒప్పందం జనవరి 2018లో సంతకం చేయబడింది. ఈ ఒప్పందం వల్ల టీసీఎస్ ఏడాదికి కవీసం 200 మిలియన్ డాలర్లను కనీస ఆదాయంగా పొందేది. దీనికింద టీసీఎస్ 10 మిలియన్లకు పైగా పాలసీల సేవలను ఒకే ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ ప్లాట్‌ఫారమ్‌గా సులభతరం చేసేందుకు పనిచేసింది. ఇంతపెద్ద ఆదాయ వనరుగా ఉన్న డీల్ అకస్మాత్తుగా ముగియటం కంపెనీకి ఆర్థికంగా పెద్ద దెబ్బని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో 11.50 గంటలకు ఎన్ఎస్ఈలో స్టాక్ 1.19 శాతం నష్టాల్లో రూ.3,177.95 వద్ద ట్రేడవుతోంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ ఏకీకృత నికర లాభం 14.8 శాతం పెరిగింది. అలాగే మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.11.392 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ.50,591 కోట్ల నుంచి 16.9 శాతం పెరిగి రూ.59,162 కోట్లకు చేరింది. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరానికి(YoY) 10.7 శాతం పెరిగింది. ఇదే సమయంలో నికర మార్జిన్ రేటు 19.3 శాతంగా ఉంది. తాజాగా జూన్ 1న కొత్త సీఈవోగా కె కృతివాసన్ బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.


Click it and Unblock the Notifications