TCS News: టీసీఎస్ పెద్ద తలకాయలకు భారీగా జీతం పెంపు.. షాకవుతున్న టెక్కీలు..

TCS News: దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థ టీసీఎస్ కంపెనీలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం జీతం స్కేల్‌ వివరాలను స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్ లో వెల్లడించింది.

ఒకపక్క ఐటీ కంపెనీలకు కీలకమైన అమెరికా, యూరప్ మార్కెట్లలోని ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో ఈ సంవత్సరం జీతాల పెంపులు సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే మరోపక్క కంపెనీలో పెద్ద స్థానాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం టీసీఎస్ యాజమాన్యం వేతనాలను భారీగా పెంచిందని వెల్లడైంది.

tcs

ఇన్ఫోసిస్ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పారిఖ్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన వార్షిక వేతనాన్ని 21 శాతం తగ్గించి రూ.56.4 కోట్లకు తగ్గించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో సలీల్ పారిఖ్ 71 కోట్ల రూపాయల వేతనం పొందడం గమనార్హం.

ఇటీవల టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ మార్చి మధ్యలో తన రాజీనామాను ప్రకటించారు. ఆయన స్థానంలో కె కార్తివాసన్ జూన్ 1 నుంచి బాధ్యతలు చేపట్టారు. అయితే గత సీఈవో రాజేష్ గోపీనాథన్ 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.30 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. ఇది అంతకు ముందు ఏడాది జీతం రూ.25.76 కోట్లతో పోల్చితే దాదాపు 13 శాతం అధికం.

గోపీనాథన్ జీతం రూ.1.73 కోట్లు, అలవెన్సులు ఇతరాలు రూ.2.43 కోట్లు, కమీషన్ రూపంలో దాదాపు రూ.25 కోట్లను అందుకున్నారు. వీటన్నింటితో కలిపి వార్షిక వేతనం రూ.30 కోట్ల ప్యాకేజీని పొందారు. అలాగే TCS COO ఎన్ గణపతి సుబ్రమణ్యం 2023లో రూ.24 కోట్లను జీతంగా పొందుతున్నారు. ఇది గతంలో ఆయన పొంది వేతనం కంటే ఎక్కవ కాగా దీనిని దాదాపు 19.50 కోట్లను కమిషన్ రూపంలో అందుకుంటున్నారు. 2017లో రాజేష్ గోపీనాథన్ వేతనం కేవలం రూ.13.37 కోట్లు మాత్రమే. చివరిగా ఆయన 120 శాతం అధిక వేతనాన్ని పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+