TCS: కరోనా తర్వాత దేశంలోని టెక్ కంపెనీలతో పాటు చాలా కంపెనీలకు ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. అదే ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకురావటం. దాదాపు రెండు సంవత్సరాలు ఇంటి నుంచి పనిచేయటానికి అలవాటుపడిన టెక్కీలు ఆఫీసులకు రమ్మనగానే 'NO' అని చెప్పేశారు. అయితే వీరిని నొప్పించకుండా ఆఫీసులకు వచ్చేలా ఒప్పించేందుకు, రప్పించేందుకు టీసీఎస్ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.

టీసీఎస్ మెయిల్..
దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. టీమ్ మెంబర్లందరికీ రిటర్న్ టు ఆఫీస్ లక్ష్యాలను వెంటనే కేటాయింటాలంటూ.. టీమ్ లీడర్లు, మేనేజర్లకు పంపిన ఈమెయిల్ లో వెల్లడించింది. పైగా ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేసే రోజులకు పాయింట్లను చేర్చడానికి దాని మూల్యాంకన వ్యవస్థను సిద్ధం చేసింది. వారానికి సగటున 3 రోజుల పాటు ఆఫీసు నుంచి ఉద్యోగి పనిచేయాలని ఇందులో స్పష్టం చేసింది.

25/25/25 మోడల్..
2025 నాటికి ఉద్యోగులందరూ ఆఫీసులో 25 శాతం సమయం మాత్రమే గడిపేటట్లు విధానాన్ని రూపొందించినట్లు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన గణపతి సుబ్రమణ్యం గతంలో తెలిపారు. నిర్దిష్ట సమయంలో 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే TCS కార్యాలయాల్లో భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది.

పాయింట్ల విధానంపై..
అప్రైజల్ సిస్టమ్‌లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాయింట్‌లను జోడించడం వల్ల ఉద్యోగి పనితీరును సరిగ్గా అంచనా వేయడంలో సహాయపడకపోవచ్చని CIEL హెచ్‌ఆర్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, CEO ఆదిత్య నారాయణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఒక ఉద్యోగి పనితీరు వారు ఆఫీసు నుంచి పనిచేస్తున్నారా లేక ఇంటి నుంచి పనిచేస్తున్నారా అనేదానికి సంబంధం లేకుండా వారు ఉత్పత్తి చేస్తున్న ఫలితాల ఆధారంగానే లెక్కించబడాలని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications