టీసీఎస్ బోనస్ కోత: ఐటీ ఉద్యోగులకు షాక్! అసలు కారణం ఇదేనా?

భారత్‌లో మార్కెట్ విలువ, ఉద్యోగుల సంఖ్య పరంగా అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ (TCS), బోనస్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారంటే అతిశయోక్తి కాదు.

టాటా గ్రూప్‌లో ఉన్నత యాజమాన్యంలో సమస్యలు కొనసాగుతున్న వేళ, ఆ సామ్రాజ్యానికే బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి టీసీఎస్.. ఏఐ టెక్నాలజీ పెరుగుదల కారణంగా అనేక వ్యాపార ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలోనే లాభాలను కాపాడుకునేందుకు, ఉద్యోగులకు ఇచ్చే బోనస్‌లో కోత విధించింది. ఇండియాలోని చాలా ఐటీ కంపెనీలు బోనస్‌లను భారీగా తగ్గించడం లేదా ఆలస్యంగా ఇవ్వడం చేస్తుంటే, టీసీఎస్ మాత్రమే నిలకడగా బోనస్ ఇస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇతర కంపెనీల మాదిరిగానే ఆదాయ, లాభాల ఒత్తిడి టీసీఎస్‌పైనా ప్రభావం చూపడం మొదలైంది.

2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి గాను టీసీఎస్ బోనస్‌ను ప్రకటించింది. గత ఏడాది 80 శాతం వరకు బోనస్ ఇచ్చిన టీసీఎస్, ఇప్పుడు కేవలం 60-70 శాతం మాత్రమే ప్రకటించింది.

కంపెనీలోని మిడ్-లెవల్ నుంచి సీనియర్-లెవల్ ఉద్యోగుల వరకు అందరికీ బోనస్ తగ్గించినట్లు సమాచారం. 'మేము 100 శాతం బోనస్ అందుకుని దాదాపు 3 సంవత్సరాలు అవుతోంది' అని చాలా మంది సీనియర్ ఉద్యోగులు వాపోతున్నారు.

అయితే, జూనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం యథావిధిగా 100 శాతం బోనస్ ఇవ్వడం గమనార్హం. ఇదే సమయంలో, ఈ వారం ప్రారంభంలో ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది.

ఇందులో జూన్ త్రైమాసికానికి సగటు బోనస్ 70 శాతంగా ఉంది. ఇది మార్చి త్రైమాసికంతో సమానమే అయినా, గత ఏడాది జూన్ త్రైమాసికంలో ఇచ్చిన 80 శాతం బోనస్‌తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం తక్కువ.

ఇలా అన్ని ప్రధాన కంపెనీలు బోనస్‌లలో కోత విధించడం ఐటీ ఉద్యోగుల జీతాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఐటీ ఉద్యోగుల జీతంలో కొంత భాగాన్ని బోనస్‌గా చెల్లిస్తారు.

ఈ మొత్తాన్ని నాలుగు త్రైమాసికాలుగా విభజించి, ఉద్యోగి పనితీరు ఆధారంగా ప్రతి క్వార్టర్‌లో బోనస్‌గా ప్రకటిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+