హైదరాబాద్ నగరం మరోసారి ఐటీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఒక అత్యాధునిక కమర్షియల్ బిల్డింగ్ రెంట్ తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి ఓ సమాచారం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఏంటంటే ఈ బిల్డింగ్ కోసం టీసీఎస్ నెలకు చెల్లించే రెంట్ అక్షరాలా రూ.4.37 కోట్లు.

పారాడిగ్మ్ రాజపుష్ప పేరుతో పిలిచే ఈ బిల్డింగ్ దాదాపు 10.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, సిటీలోని అత్యంత ముఖ్యమైన బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉండటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దింతో టీసీఎస్ ప్రతి చదరపు అడుగుకు రూ.43 చొప్పున అద్దె చెల్లిస్తోంది. అంతేకాదు, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ అద్దె ఏకంగా 12 శాతం పెరుగుతుందట. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్‌గా టీసీఎస్ 26.2 కోట్లు కట్టింది కూడా. అంటే ఈ మొత్తం దాదాపు ఆరు నెలల రెంటుతో సమానం.
ప్రాప్‌స్టాక్ అనే సంస్థ ద్వారా లీజు పేపర్స్ ప్రకారం, ఈ లీజు డీల్ ఏకంగా 15 సంవత్సరాల పాటు చేసుకుంది. గత ఏడాది అక్టోబర్ 1 నుండి ప్రారంభమైన ఈ లీజుతో టీసీఎస్ హైదరాబాద్‌లో కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో గత 12 నెలలుగా చూస్తే డీల్ సైజ్ కేవలం 56 వేలు చదరపు అడుగులకి మాత్రమే. అలాగే ఆవరేజ్ రెంట్ చదరపు అడుగుకు రూ.70గా ఉంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే టీసీఎస్ తీసుకున్న స్థలం సైజ్ చాలా పెద్దదని అర్థమవుతోంది.
రాజపుష్ప గ్రూప్ నిర్మించిన ఈ గ్రేడ్-ఎ కమర్షియల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఫుడ్ కోర్ట్ ఇంకా మరో 19 అంతస్తులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే విప్రో, ఐసిఐసిఐ, బ్రాడ్‌రిడ్జ్ అండ్ ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు కొనసాగిస్తున్నాయి. టీసీఎస్ రాకతో ఈ ప్రాంతం మరింత సందడిగా మారనుంది.
మరోవైపు హైదరాబాద్ ఆఫీస్ స్పెస్ మార్కెట్ కూడా దూసుకుపోతోంది. 2025 మొదటి త్రైమాసికంలోనే 2.7 మిలియన్ చదరపు అడుగుల స్థలం వినియోగించింది. ఇంకా గత సంవత్సరంతో పోలిస్తే 17 శాతం ఎక్కువ. రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫీస్ స్థలాలు అందుబాటులోకి రానున్నప్పటికీ, అద్దెకు తీసుకునేందుకు కంపెనీలు కూడా ఆసక్తి చూపుతుండటం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 28 మిలియన్ చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉండగా, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీల రాకతో ఈ పరిస్థితి త్వరలోనే మారే అవకాశం ఉంది. టీసీఎస్ ఈ భారీ రెంట్ డీల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఒక ఊపునిస్తుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications