TCS Q3 Results: దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్యూ3 ఎర్నిగ్స్ సీజన్ టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రారంభించింది. మంచి ఫలితాలతో సీజన్ స్టార్ట్ చేయటంతో ఐటీ స్టాక్స్ పై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. ఇది మార్కెట్లకు పాజిటివ్ సంకేతాలను అందిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
నేడు స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికర లాభం 12 శాతం పెరిగి రూ.12,380 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో కంపెనీ త్రైమాసిక ఆదాయం రూ.63,973 కోట్లుగా నిలిచింది. ఏడాది ప్రాతిపదికన ఆదాయం 5 శాతం వృద్ధిని సాధించింది. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.11,058 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఫలితాల ప్రకటన సమయంలో పెట్టుబడిదారులకు ఒక్కో షేరుపై రూ.10 మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు ప్రకటించింది.

ఇదే క్రమంలో షేరుకు రూ.66 స్పెషల్ డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. మెుత్తం మూడు త్రైమాసికాల్లో కంపెనీ దాదాపు రూ.1,10,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు అందించింది. అలాగే మూడవ త్రైమాసికంలో ఏకంగా 25,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు అందిస్తున్నట్లు చీఫ్ హెచ్ఆర్ మిలిందా లఖ్కర్ వెల్లడించారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మెుత్తంగా 6,03,354 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న 6,12,724 మందితో పోల్చితే 5,370 తక్కువ కావటం గమనార్హం. ఈ క్రమంలో కంపెనీలలో అట్రిషన్ రేటు 13 శాతం వద్ద గత ఏడాది నుంచి స్థిరంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం కంపెనీలో మెుత్తం ఉద్యోగుల్లో 35.3 శాతం మంది మహిళలని కంపెనీ పేర్కొంది. పైగా 152 వివిధ దేశాలకు చెందిన ప్రజలు తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. మార్కెట్ అంచనాలకు మించిన పనితీరును కొనసాగించటంపై బ్రోకరేజీలు సైతం సానుకూలంగా ఉన్నాయి.
- మాక్వేరీ రూ.5,710 టార్గెట్ ధరతో టీసీఎస్ షేర్లపై OUTPERFORM రేటింగ్‌ను అందించింది.
- మోతీలాల్ ఓస్వాల్ రూ.5,000 లక్ష్య ధరకు టీసీఎస్ షేర్లపై BUY రేటింగ్‌ను ఇచ్చింది.
- BNP పారిబాస్ రూ.4,850 లక్ష్య ధరకు టీసీఎస్ షేర్లపై OUTPERFORM రేటింగ్‌ను ఇచ్చింది.
- బెర్న్‌స్టెయిన్ రూ.4,820 లక్ష్య ధరకు టీసీఎస్ షేర్లపై OUTPERFORM రేటింగ్‌ను ఇచ్చింది.
- జెఫరీస్ రూ.4,775 లక్ష్య ధరకు టీసీఎస్ షేర్లపై BUY రేటింగ్‌ను ఇచ్చింది.
- మోర్గాన్ స్టాన్లీ రూ.4,600 లక్ష్య ధరకు టీసీఎస్ షేర్లపై OVERWEIGHT రేటింగ్‌ను ఇచ్చింది.
- IIFL రూ.4,600 లక్ష్య ధరకు టీసీఎస్ షేర్లపై BUY రేటింగ్‌ను ప్రారంభించింది.
- TCS షేర్లపై జేపీ మోర్గాన్ తటస్థంగా ఉంది. స్టాక్ టార్గెట్ ధరను రూ.4,500గా నిర్దేశించింది.
- ఐడిబిఐ క్యాపిటల్ టీసీఎస్ షేర్లపై రూ.4,389 టార్గెట్ ధరతో హోల్డ్ రేటింగ్ అందించింది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications