it news: దేశం గర్వించదగ్గ సంస్థల్లో TCS ముందుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ IT సేవలు అందిస్తూ.. ఇండియా కీర్తిపతాకాన్ని నలుదిశలా వ్యాపింప చేస్తోంది. వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో ఇప్పుడు అగ్రస్థానం దక్కించుకుంది. భారత టెక్ దిగ్గజానికి జర్మనీ వ్యాప్తంగా క్లయింట్ లు బ్రహ్మరథం పట్టారు. IT పరిశ్రమ యావరేజ్ రేటింగ్ ను మించి ప్రైవేటు సంస్థ నిర్వహించిన స్వతంత్ర సర్వేలో భారీ ఎత్తున మార్కులు సాధించింది.

22 సంస్థలను తోసి రాజని..
జర్మనీలో వైట్ లేన్ రీసెర్చ్ మరియు నావిస్కో చేసిన సర్వేలో TCS నంబర్ 1 స్థానంలో నిలిచింది. 180కు పైగా CXO (చీఫ్ ఎక్స్ పీరియన్స్ ఆఫీసర్)లు, వివిధ IT సంస్థల సీనియర్ నిర్ణయాధికారుల స్పందనల ఆధారంగా నివేదిక రూపొందించారు. ఈ ప్రక్రియలో భాగంగా సర్వీస్ డెలివరీ, రిలేషన్ షిప్, కమర్షియల్, ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు ఎనిమిది కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI)ను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ ప్రయాణంలో సర్వీస్ ప్రొవైడర్ల పనితీరు అంచనా వేయడానికి 450కి పైగా సంస్థలను సంప్రదించారు. అందరి అభిప్రాయాలను పరిశీలించిన పిమ్మట 22 సంస్థలకు ర్యాంక్ లు ఇచ్చారు.

టాప్ సంస్థలన్నీ క్లయింట్లే..
పరిశ్రమ సగటు 74 శాతంతో పోలిస్తే, 82 శాతం సంతృప్తికర స్కోరుతో జర్మనీ మొత్తంలో TCS విజయబావుటా ఎగరేసింది. ఇదే కాకుండా బిజినెస్ అండర్‌స్టాండింగ్ (82 శాతం), సర్వీస్ డెలివరీ క్వాలిటీ (82 శాతం) విషయంలోనూ అత్యధిక స్కోరు సాధించినట్లు సర్వే పేర్కొంది.
ప్రస్తుతం 100 ప్రముఖ జర్మన్ సంస్థలతో TCS భాగస్వామ్యం కలిగి ఉంది. DAX40 లోని 19 కంపెనీలతో పాటు హేగర్ గ్రూప్, లెడ్‌వాన్స్ GmbH వంటి అనేక పెద్ద, మధ్య తరహా కంపెనీల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవే విజయానికి మూల స్తంభాలు:
"మా జర్మన్ క్లయింట్లను సంతృప్తి పరచడంలో నంబర్ వన్ స్థానంలో నిలిచినందుకు సంతోషిస్తున్నాము. వారు మాపై ఉంచిన నమ్మకానికి, భాగస్వామ్యానికి ధన్యవాదాలు" అని TCS సెంట్రల్ యూరప్ హెడ్ భువన్ అగర్వాల్ పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని పంచేందుకు, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎదుగుదలకు సాంకేతికత ద్వారా ముందుకు వెళ్తున్నామన్నారు. కస్టమర్-సెంట్రిక్ విధానం, సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా మలచుకోవడం, స్థానిక ప్రతిభ, స్థిరత్వం, నూతన ఆవిష్కరణల్లో పెట్టుబడులు మా విజయానికి మూల స్తంభాలు అని తెలిపారు.

ప్రతిభకు సలాం:
"కస్టమర్‌ల అభివృద్ధి, ట్రాన్స్ ఫర్మేషన్ లో భాగమవుతూ.. జర్మనీలోని తన క్లయింట్‌లతో TCS శాశ్వత బంధాన్ని ఏర్పరచుకుంది. కఠినమైన ఆర్థిక పరిస్థితులు, వేగంగా మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ధీటైన సేవలందిస్తూ.. ఏళ్ల తరబడి అధిక సంతృప్తికర స్కోర్‌లను పొందడం చాలా గొప్ప విషయం. అంకితభావంతో పనిచేసే TCS బృందాలకు, వారి అత్యుత్తమ ప్రతిభకు అభినందనలు" అని వైట్‌లేన్ రీసెర్చ్ సోర్సింగ్ హెడ్ జెఫ్ లూస్ కితాబిచ్చారు.

మరిన్ని రికార్డులు సొంతం:
1991 నుంచి జర్మనీలో TCS సేవలు అందిస్తోంది. ఆ దేశంలో TCS ను టాప్ ఎంప్లాయర్ గా "టాప్ ఎంప్లాయర్స్ ఇన్‌స్టిట్యూట్" ఈ ఏడాది ప్రారంభంలో గుర్తించింది. ఐరోపాలోని డిజిటల్ వర్క్‌ప్లేస్ సర్వీసెస్‌లో లీడర్‌గా ఎవరెస్ట్ గ్రూప్ నుంచి TCS గుర్తింపు పొందింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications