TCS News: ఇండియన్ దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా తన త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసింది. నికర లాభంతో పాటు EBITDA మార్జిన్ కూడా మెరుగుపడినట్లు ప్రకటించింది. దీంతో పాటు ఉద్యోగులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి వెల్లడించింది.
టాటా గ్రూపుకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగుల్లో 70 శాతం మందికి శుభవార్త చెప్పింది. 100 శాతం వేరియబుల్ పే చెల్లించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికానికి సంబంధించి ఈ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. జూనియర్ నుంచి మధ్య స్థాయి సిబ్బంది వరకు దీని ద్వారా బెనిఫిట్ పొందుతారని వివరించింది.

'ఎప్పటి మాదిరిగానే 70 శాతం ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే ఇవ్వబడుతుంది. మిగిలిన 30 శాతం మందికి వ్యాపార సంబంధిత పనితీరు ఆధారంగా చెల్లింపులు జరుగుతుతాయి' అని కంపెనీ Q3 ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో CHRO మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఇతర కాంపిటీటర్స్ ఇన్ఫోసిస్, విప్రోలు Q2లో 80 శాతం వేరియబుల్ పే ఇవ్వగా.. TCS మాత్రం Q1 మరియు Q2 రెండింటిలోనూ 100 శాతం చెల్లించింది.
అయితే వరుసగా రెండవ త్రైమాసికంలోనూ TCS అట్రిషన్ రేటు తగ్గుదలను నమోదు చేసింది. QoQ 5,680 మంది కంపెనీని వీడినట్లు పేర్కొంది. గత త్రైమాసికంలోని 14.9 శాతం నుంచి 13.3 శాతానికి తగ్గినట్లు తెలిపింది. దాదాపు 18 నెలలుగా ఈ వ్యవహారంపై పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ఫలితం దక్కుతోందని లక్కడ్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications