భారతదేశ ఐటీ రంగం గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వృద్ధిని సాధించింది. కంపెనీల ఆదాయం కోట్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో భారత్ ఐటీ హబ్‌గా నిలిచింది. కానీ, ఒక విషయంలో మాత్రం కాలం వెనక్కే ఆగిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. అదే ఐటీ ఫ్రెషర్ల ప్రారంభ జీతం (Entry-level salary). 2004లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఎంత జీతం ఇచ్చేవారో.. 2026లో కూడా దాదాపు అదే స్థాయిలో ఆఫర్ చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2004 వర్సెస్ 2026: అప్పుడు ఓకే.. ఇప్పుడు కష్టమే!
2004-2005 కాలంలో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) వంటి దిగ్గజ కంపెనీలలో చేరిన ఫ్రెషర్లకు ఏడాదికి రూ. 2.8 లక్షల నుండి రూ. 3.1 లక్షల వరకు ప్యాకేజీ లభించేది. ఆ సమయంలో జీవన వ్యయం తక్కువగా ఉండటంతో ఆ జీతం గౌరవప్రదంగా ఉండేది. కానీ, సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కూడా చాలా పెద్ద ఐటీ సంస్థలు ఫ్రెషర్లకు అదే రూ. 3 లక్షల నుండి రూ. 3.5 లక్షల లోపు ప్యాకేజీనే ఆఫర్ చేస్తున్నాయి.
జీతాలు పెరగకపోవడానికి కారణాలు ఏంటి?
ఐటీ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..
- గ్రాడ్యుయేట్ ఓవర్‌సప్లై: భారతదేశం ప్రతి ఏటా సుమారు 15 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తోంది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు జీతాలను పెంచాల్సిన అవసరం లేకుండా పోతోంది.
- నైపుణ్యాల కొరత: లక్షల మంది పట్టా పొందుతున్నా, కంపెనీలకు కావాల్సిన వెంటనే పని చేయగలిగే నైపుణ్యాలు (Deployable skills) ఉన్నవారు తక్కువగా ఉంటున్నారు. దీనివల్ల కంపెనీలు ఫ్రెషర్లను కేవలం 'ట్రైనీలు'గానే పరిగణించి తక్కువ జీతాలు ఇస్తున్నాయి.
పెరిగిన ఖర్చులు.. తగ్గిన కొనుగోలు శక్తి
నామమాత్రంగా జీతం రూ. 3 లక్షలుగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దాని విలువ చాలా తగ్గిపోయింది. బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2004లో రూ. 3 లక్షల జీతంతో సాఫీగా సాగిపోయే జీవితం నేటి కాలంలో కేవలం మనుగడ సాగించడానికే సరిపోతోందని ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నైపుణ్యం ఉంటేనే అధిక ప్యాకేజీ!
అయితే అందరికీ జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పలేం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ కంప్యూటింగ్ , సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతలలో నైపుణ్యం ఉన్న ఫ్రెషర్లు ఇప్పటికీ రూ. 6 లక్షల నుండి రూ. 12 లక్షల ప్యాకేజీలను అందుకుంటున్నారు. జెనరేటివ్ AI వంటి విభాగాల్లో నిపుణులైతే ఏకంగా రూ. 22 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్నారు. అంటే కేవలం డిగ్రీ ఉండటం కంటే డిమాండ్ ఉన్న నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారానే ఐటీ రంగంలో మంచి జీతం (salary) సాధించడం సాధ్యమవుతుంది.
మొత్తంగా చెప్పాలంటే సాంప్రదాయ ఐటీ సర్వీసెస్ మోడల్ ఇప్పుడు ఒత్తిడికి లోనవుతోంది. పెరిగిన ఖర్చులు, మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో కంపెనీలు తమ శాలరీ స్ట్రక్చర్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రతిభావంతులైన యువత ఈ రంగం నుండి తప్పుకునే ప్రమాదం ఉంది.
More From GoodReturns

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications