Multibagger Stock: 17% పెరిగిన స్టాక్.. ఏడాదిలో పైసా ట్రిపుల్.. రాకెట్ వేగంతో..
Multibagger Stock: ప్యాకేజింగ్ రంగంలోని మల్టీబ్యాగర్ స్టాక్ తన ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది. తాజాగా ఈ స్టాక్ ధర గరిష్ఠాలకు చేరుకోవటంతో ఇన్వెస్టర్ల పంట పండింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ప్యాకేజింగ్ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న టిసీపీఎల్ ప్యాకేజింగ్ లిమిటెడ్ కంపెనీ స్టాక్స్ గురించే. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్టాక్ ఈరోజు ఏకంగా 17 శాతం పెరిగి రికార్డు ధరలకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా ఈ కంపెనీ వాటాలు బులిష్ గా ఉన్నాయి. కేవలం ఒక్క నెలలో కంపెనీ షేర్లు 32% కంటే ఎక్కువ పెరిగి ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చాయి.

కంపెనీ లాభాలు..
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో TCPL ప్యాకేజింగ్ ఏకీకృత నికర లాభం రూ.39.5 కోట్లుగా ఉంది. TCPL ప్యాకేజింగ్ లాభం ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 3 రెట్లు పెరిగింది. గడచిన ఏడాది రెండవ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.10.6 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 43% పెరిగి రూ.361.7 కోట్లకు చేరుకోగా.. గత సంవత్సరం ఇది రూ.253 కోట్లుగా ఉంది.

ఏడాదిలో పైసా డబుల్..
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ ధర 220% పెరగటం గమనార్హం. జనవరి 3,2022న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్ ధర రూ.520.10 వద్ద ఉంది. అయితే ఈ రోజు స్టాక్ భారీ ర్యాలీ కారణంగా దీని ధర రూ.1,696 స్థాయిని తాకింది. అలా ఏడాది కాలంలో స్టాక్ ఏకంగా 234% పెరుగుదలను నమోదు చేసింది. ఆరు నెలల కాలంలో షేర్ 115% పెరిగాయి.

కంపెనీ వ్యాపారం..
ఏడాదిలో లక్ష పెట్టుబడిని మూడింతలు చేసిన కంపెనీ ప్యాకేజింగ్ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ దేశంలోని గోద్రేజ్, నెస్లే, టాటా కన్జూమర్స్, యూనీలివర్, అబాట్, నివ్యా, అబాట్, సిప్లా, ఐటీసీ వంటి అనేక ప్రఖ్యాత కంపెనీలకు ప్యాకేజింగ్ మెటీరియల్ సప్లై చేస్తోంది. వీటికి తోడు లిక్కర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాల్లో అనేక మంది కస్టమర్లను కలిగి ఉంది. 1987లో స్థాపించబడిన కంపెనీ.. 30 ఏళ్లుగా ఈ రంగంలో దేశంలోని అగ్రగామి సంస్థగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications