TBO Tek IPO: మార్కెట్లు నేడు పతనం కొనసాగిస్తున్న వేళ ఐపీవోలు మాత్రం తమ పవర్ చూపిస్తున్నాయి. మెయిన్ కేటగిరీలో నేడు మార్కెట్లోకి వచ్చిన ఐపీవో లిస్టింగ్ లాభాలతో తన పెట్టుబడిదారులను సంతోషంలోకి నెట్టేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టిబిఓ టెక్ ఐపీవో. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి. వాస్తవానికి కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి 50 శాతం ప్రీమియంతో రూ.1,380 వద్ద జాబితా అయ్యాయి. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో షేర్లు 55 శాతం ప్రీమియం రేటు రూ.1,426 వద్ద బలమైన జాబితాను నమోదు చేశాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మే 8న ప్రారంభమైన ఐపీవో మే 10న ఇష్యూ ముగించింది.

దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఐపీవో కోసం లాట్ పరిమాణాన్ని 16 షేర్లుగా నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.875-920గా ప్రకటించింది. తాజా ఐపీవో నుంచి కంపెనీ రూ.1,550.81 కోట్లను సమీకరించింది. దీనిలో రూ.400 కోట్ల తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని సమీకరించేందుకు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 1,25,08,797 షేర్లను కంపెనీ విక్రయించింది.
ఐపీవో ఇష్యూ సమయంలో కంపెనీ షేర్లకు బలమైన బిడ్డింగ్ జరిగి మొత్తం 86.70 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్లు కోటా 125.51 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 50.60 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 25.74 సార్లు సబ్ స్క్రైబ్ చేయబడింది. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగుల కోసం ముందుగానే రిజర్వు చేసిన భాగం 17.82 రెట్లు బిడ్డింగ్ నమోదు చేసింది. కంపెనీ షేర్లు బలమైన అరంగేట్రంతో ఇన్వెస్టర్లు ఖుషీగా ఉన్నారు. ఐపీవోకి యాక్సిస్ క్యాపిటల్, గోల్డ్ మాన్ సాక్చ్, జేఎమ్ ఫైనాన్షియల్, జఫ్ఫరీస్ ఇండియా బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి.
వాస్తవానికి 2006లో స్థాపించబడిన టిబిఓ టెక్ గతంలో టెక్ ట్రావెల్స్‌గా పిలువబడేది. ఇది ట్రావెల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్లాట్‌ఫారమ్ తన కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా ప్రయాణ జాబితాలను అందిస్తుంది. ఫారెక్స్ మద్దతుతో పాటు అనేక రకాల కరెన్సీలకు మద్దతు ఇస్తుంది.


Click it and Unblock the Notifications