Multibagger Stock: ఎవరికీ డబ్బులు ఊరికే రావు అనే మాటలు తెలుగు వారికి చాలా పరిచయం. స్టాక్ మార్కెట్లలో కూడా ఇదే ఫార్ములా పనిచేస్తుంది బాస్. సరైన సమయంలో మల్టీబ్యాగర్ షేర్లను గుర్తించే వారికి మాత్రం కాసుల పంట కురుస్తోంది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టేలర్‌మేడ్ రెన్యూవబుల్స్ కంపెనీ గురించే. అవును నమ్మి తమ డబ్బును పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ మల్టీ బ్యాగర్ రాబడులను అందించింది. పైగా గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ క్రమంలో షేర్ల ధర దాదాపు 28 శాతం మేర పెరిగింది.

ఏడాది కాలంలో షేర్ ధర దాదాపు 2000 శాతానికి పైగా పెరిగింది. ఈ క్రమంలో ఒక్కో షేరు ధర రూ.14 నుంచి రూ.340 స్థాయికి పెరిగింది. ప్రస్తుతం షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.341ని తాకిన తర్వాత.. ఈరోజు మాత్రం 5 శాతం క్షీణించింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.341 వద్ద ఉండగా.. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.8.75 వద్ద ఉంది. అయితే ఏడాది కాలంలో ఇన్వెస్టర్లు ఊహించని లాభాలను అందుకున్నారు.
ఏడాది కిందట ఏప్రిల్ 27, 2022న స్టాక్ ధర బీఎస్ఈలో రూ.14.30వద్ద ఉంది. ఆ సమయంలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.23 లక్షలు పొందేవారు. అలాగే కనీసం 10 నెలల కిందట పెట్టుబడి పెట్టిన వారు సైతం 3800 శాతం రాబడిని పొందేవారు. అంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే ఏడాది లోపే ఏకంగా రూ.38 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందేవారు.
అలాగే ఎవరైనా ఇన్వెస్టర్ దీర్ఘకాలంలో మూడేళ్ల కిందట ఈ కంపెనీలో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ షేర్ల విలువ రూ.1.18 కోట్లకు చేరుకుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న కంపెనీ.. ఫోటోవోల్టాయిక్స్, ఎవాక్యుయేటెడ్ ట్యూబ్‌లు, ప్యానెల్లు, ఎయిర్ సోర్స్ హీట్ పంపులు, డిష్ కుక్కర్లు, డ్రైయర్‌లు, బయోమాస్ గ్యాస్‌ఫైయర్‌లు, కుక్ స్టవ్‌లు ఉత్పత్తులను తయారు చేస్తోంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications