కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానం (New Tax Regime) ప్రవేశపెట్టినప్పటి నుంచి.. పన్ను చెల్లింపుదారులకు కొన్ని ప్రశ్నలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) కొనసాగించాలా లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలా? అనే దానిపై ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. నిర్ణయం తీసుకోవడంలొ ప్రధానంగా ఆదాయం, దానిపై లభించే తగ్గింపులు, మినహాయింపుల పరిమితులు వంటివి ప్రభావం చూపుతున్నాయి.
2023 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ (Default) విధానంగా ప్రకటించింది. దీని అర్థం ఏంటంటే కొత్త విధానాన్ని ఎంచుకోని పన్ను చెల్లింపుదారులు ఆ విధానం ప్రకారం వారి పన్ను లెక్కింపును ఎదుర్కొంటారు. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం వర్తించనుంది.

కొత్త పన్ను విధానం కింద.. బడ్జెట్ 2025లో పన్ను స్లాబ్లు సవరణలతో తీసుకొచ్చారు. ప్రాథమిక మినహాయింపు రూ.4 లక్షలకు పెంచారు. కాబట్టి తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఎక్కువ ఆదా చేయవచ్చు. అదే పాత విధానంలో 60 ఏళ్లలోపు వ్యక్తుల ప్రాథమిక మినహాయింపు రూ. 2.5 లక్షలు, సీనియర్ సిటిజన్లకు రూ. 3 లక్షలు, సూపర్ సీనియర్ (80+) సిటిజన్లకు రూ. 5 లక్షలు ఉండేది. ఇక పాత విధానంలో కుటుంబ పెన్షన్ మినహాయింపు రూ. 50 వేలు గా ఉండగా, కొత్త విధానంలో ఇది రూ. 25 వేలకి పెంచారు.
2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 12.75 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పన్ను విధానం కింద ప్రయోజనాన్ని పొందవచ్చు. అధిక ఆదాయం (రూ. 25 లక్షల వరకు) ఉన్నవారికి కూడా కొత్త విధానం ద్వారా రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదా సాధ్యమే. అదనంగా తక్కువ సర్‌ఛార్జ్ రేట్ల కారణంగా రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయమున్నవారికి కూడా కొత్త విధానం లాభదాయకంగా ఉంటుంది.
రెండింటి మధ్య తేడా ఏమిటంటే.. పాత పన్ను విధానం వివిధ తగ్గింపులు, మినహాయింపులను (Sections 80C - ELSS, PPF, జీవిత బీమా, 80D - వైద్య బీమా, HRA, గృహ రుణ వడ్డీ మొదలైనవి) క్లెయిమ్ చేయగలుగుతుంది. దీని వల్ల ఎక్కువ ఆదాయ bracketలో ఉన్న వ్యక్తులకు గణనీయమైన పన్ను ఆదా ఉంటుంది.
కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పెద్దగా తగ్గింపులు లేవు. కేవలం ప్రామాణిక మినహాయింపు, NPSలో యజమాని సహకారం (Section 80CCD(2)), కొన్ని పదవీ విరమణ సంబంధిత మినహాయింపులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ELSS, HRA, గృహ రుణ వడ్డీ వంటి ఎంపికలు కొత్త విధానంలో లేవు.
క్లుప్తంగా చెప్పాలంటే.. పాత పన్ను విధానం ఎక్కువ తగ్గింపులు.. మినహాయింపులను ఉపయోగించగలిగే వ్యక్తులకు బలంగా ఉంటుంది. అదే కొత్త పన్ను విధానం తక్కువ తగ్గింపులు ఉన్నవారికి, సరళమైన రేట్లు కావాలని కోరుకునేవారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సరైన ఎంపికను నిర్ణయించుకోవడానికి పన్ను కౌన్సిలర్ లేదా Chartered Accountant ను సంప్రదించడం తప్పనిసరి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications