ట్యాక్స్ ఫైల్ చేసే వారికి ఇక సమయం లేదు. పన్ను ఆదా చేసుకోవాలంటే వెంటనే కొన్ని పనులు చేయాల్సిందే. 80 సీ, 80 డీ కింద పన్ను ఆదా చేసుకోవడానికి పలు పథకాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. పన్ను ఆదా చేసుకునే మార్గాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వేతన జీవులకు సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా పొందవచ్చు. 80CCD(1b) లో అదనంగా రూ.50,000 మినహాయింపు పొందొచ్చు. జీవిత బీమా పాలసీలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, గరిష్ఠంగా ఇద్దరు పిల్లలను చదివించడానికి ట్యూషన్ ఫీజు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనడం లేదా నిర్మాణం, కనీసం 5 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌లు, నాబార్డ్ బాండ్ల కొనుగోలు లాంటివాటిలో పెట్టుబడి పెట్టి సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు.

ఆరోగ్య బీమా చేసుకుని సెక్షన్ 80 డీ ద్వారా కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆరోగ్య బీమాను వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరు మీదు తీసుకున్నా పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా చేయించినా పన్ను మనహాయింపు పొందవచ్చు. తల్లిదండ్రుల వయస్సు 60 ఏళ్ల కంటే తక్కువ ఉంటే రూ.25 వేలు. 60 ఏళ్ల కంటే ఎక్కువుంటే రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పెట్టుబడి పెట్టి పన్ను ఆదా చేసుకోవచ్చు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCD కింద మినహాయింపు పొందవచ్చు. గృహ రుణంపై వడ్డీ కూడా రూ.50,000 వరకు మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఆప్షన్ గా ఉంది. ఒక వ్యక్తి ఐదేళ్ల కాల వ్యవధిలో రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications