Income Tax Benefits: మోదీ సర్కార్ పన్ను ప్రయోజనాలను పరిమితం చేస్తూ న్యూ టాక్స్ రీజిమ్ దేశంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇది ఎక్కువగా నేటి తరం యువతను ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటికీ చాలా మంది పాత పన్ను విధానాన్నే వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. మరోమారు మోదీ సర్కార్ అధికారంలోకి వస్తే పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తుందనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో న్యూ టాక్స్ విధానం కింద ఉండే ప్రయోజనాలు, అందులోని స్లాబ్ రేట్ల గురించి పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవటం వారికి ఎక్కువ స్పష్టతను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ITR ఫైల్ చేయబోతున్నట్లయితే కొత్త పన్ను విధానం కింద ఉన్న 8 ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకోండి...

- ముందుగా న్యూ టాక్స్ రీజిమ్ యువ పన్ను చెల్లింపుదారులను ఆకర్షించటానికి కారణం తక్కువ పన్ను రేటు. ఇది తక్కువ పన్ను బాధ్యతతో వినియోగించుకునేందుకు అధిక మెుత్తాన్ని టాక్స్ పేయర్స్‌కి అందిస్తుంది. కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా తక్కువ పన్ను రేట్లను అందిస్తున్నప్పటికీ దీనిని మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు మోదీ సర్కార్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
- న్యూ టాక్స్ విధానంలో గందరగోళాలకు తావు లేదు. సీఏ వంటి నిపుణుల సహాయం లేకపోయినా సొంతంగా టాక్స్ ఫైలింగ్ పూర్తి చేసేందుకు వెసులుబాటు ఇందులో ఉంది. పైగా తక్కువ పన్ను రేట్లను అందించడం ద్వారా ఈ పన్ను నిర్మాణాన్ని చాలా సులభతరం చేసింది. కొత్త పన్ను విధానం కింద రూ.3 లక్షల వార్షిక ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.9 నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.12-15 లక్షల వరకు ఆదాయం పై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆపైన ఉన్న ఆదాయంపై 30 శాతం పన్ను చెల్లించాలని కొత్త పన్ను విధానం సూచిస్తోంది.
- న్యూ టాక్స్ రీజిమ్ పన్ను చెల్లింపుదారులకు సమయం శ్రమను ఆదా చేసేందుకు పన్ను మినహాయింపులను ట్రాక్ చేయడం, క్లెయిమ్ చేయడం అవసరం. ఈ విధానం కింద టాక్స్ పేయర్స్ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు, సాక్ష్యాలను సేకరించి సమర్పించాల్సిన అవసరం లేదు.
- గతంలో కొత్త పన్ను విధానం కింద రూ.2.5 లక్షలుగా ఉన్న ప్రాథమిక పన్ను మినహాయింపును నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో రూ.3 లక్షలకు పెంచుతున్నట్లు గతంలో వెల్లడించారు. ఈ పెరిగిన మినహాయింపు పరిమితి కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తోంది.
- అదే విధంగా కొత్త పన్ను విధానం అమలుతో సర్‌చార్జి 37% నుంచి 25%కి తగ్గింది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. ఈ తగ్గిన సర్‌ఛార్జ్ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
- పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఉన్న ఆదాయానికి మినహాయింపు పరిమితి రూ.12,500. అయితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉంటే, మినహాయింపు పరిమితి రూ.25,000కి పెంచబడింది. రెండు ఆదాయపు పన్ను విధానాలలో సెక్షన్ 87A మినహాయింపు వర్తిస్తుంది. బడ్జెట్ ప్రకటన పన్ను పరిధిలోకి వచ్చే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. శాలరీడ్ ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000గా ఉంది.
- కొత్త పన్ను విధానంలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై మినహాయింపును పన్ను చెల్లింపుదారులు పొందుతారు. 2023 బడ్జెట్ ప్రసంగం ప్రకారం.. ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మినహాయింపు పరిమితిని 8 రెట్లు అంటే రూ.3 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది పూర్తిగా పన్ను రహితమైనది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications