IT Raids: ఆల్కహాల్ డిస్టిలరీపై ఐటీ దాడులు.. బయటపడ్డ డబ్బు కట్టలు..
Boudh Distilleries: ఆల్కహాల్ తయారీ రంగంలో ఉన్న బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో డబ్బు దొరకటం గమనార్హం.
కంపెనీకి చెందిన ఒడిశా, జార్ఖండ్ ప్రాంగణాల్లో పన్ను అధికారులు శోధాలు చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్‌లోని కార్యాలయాలు, నివాసాలతో పాటు జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దగాలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో మెుత్తం రూ.50 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అధికారులు భారీగా దొరికిన సొమ్మును లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లు పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్,ఆర్థిక లావాదేవీలపై కొనసాగుతున్న విచారణ సంక్లిష్టమైన, విస్తృతమైన స్వభావాన్ని ఇది హైలైట్ చేస్తుంది. కంపెనీ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో అధికారులు సోదాలను ప్రారంభించారు. కంపెనీ తన ఆదాయాన్ని తక్కువగా చూపటంతో పాటు అక్రమ మార్గాల ద్వారా నిధులను మళ్లింపు కోణంలో పన్ను శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.
తాజా దాడులతో ఒడిశా, జార్ఖండ్‌లోని వ్యాపార వర్గాలు షాక్‌కు గురవుతున్నారు. రెండు రోజులుగా కొనసాగుతున్న దాడుల్లో రూ.150 కోట్లు బయటపడ్డాయని ఒడిశా టీవీ నివేదించింది. కంపెనీ బల్డియో సాహు ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లై యాష్ బ్రిక్స్), క్వాలిటీ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IMFL బాట్లింగ్), కిషోర్ ప్రసాద్ బిజయ్ ప్రసాద్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (IMFL బ్రాండ్‌ల విక్రయాలు & మార్కెటింగ్) వ్యాపారాలను రాష్ట్రంలో నిర్వహిస్తోంది.
బోలంగీర్ పట్టణంలోని సుదాపాడ, తితిలాగఢ్ పట్టణంలోని ఇద్దరు మద్యం వ్యాపారుల ఇళ్లలో కూడా ఐటీ శాఖ ఏకకాలంలో దాడులు నిర్వహించి నగదును స్వాధీనం చేసుకుంది. ఐటీ అధికారులు నిన్న రాత్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోలంగీర్ బ్రాంచ్‌కు పెద్ద ట్రక్కులో లోడ్ చేసిన డబ్బు సంచులు, బస్తాలను తీసుకువచ్చింది. ఆ డబ్బునంతా బ్యాంకులోపలికి తీసుకెళ్లి గట్టి భద్రతతో డిపాజిట్ చేశారు.


Click it and Unblock the Notifications