అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా భారత్ లోకి తన వై మోడల్ ఈవీ కారు ద్వారా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. టెస్లా ముంబైలో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. తాజాగా ఈ కారుకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో బుకింగ్ చేసుకున్న వారికి వై మోడల్ కారు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అయితే ధరపై అందరూ పెదవి విరుస్తున్నారు. దేశంలో రూ. 61 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఈ కారు భారత విపణిలోకి ప్రవేశించింది. అయితే అమెరికాలో దీని ధర 37,490 డాలర్లు(సుమారు రూ. 32 లక్షలు)కి అందుబాటులో ఉంది. ఈ ధరల్లోని భారీ వ్యత్యాసంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
టెస్లా వెబ్‌సైట్ ప్రకారం.. Tesla Model Y లో ఒక మోడల్ ధర రూ. 59.89 లక్షలు కాగా మరొక మోడల్ ధర రూ. 67.89 లక్షలు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ ధర చాలా ఎక్కువ. అమెరికాలో ఈ కారు ధర దాదాపు రూ. 33 లక్షలు. టెస్లా ఖరీదైన కారుపై చాలా మంది కోపంగా ఉన్నారు. ఈ కారుపై విధించిన పన్నుపై వినియోగదారులు మండిపడుతున్నారు. కారు ధరలో దాదాపు సగం పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు సోషల్ మీడియాలో టెస్లా పేరును TAX-LA అని పిలుస్తున్నారు.

వాస్తవానికి చైనాలో పూర్తిగా తయారైన ఈ కారును భారతదేశానికి తీసుకురావడం..అలాగే కొన్ని లగ్జరీ వస్తువులపై పన్ను విధించడం వల్ల దీని ధర చాలా ఎక్కువగా ఉంది. టెస్లా ప్రస్తుతం చైనాలో తయారైన కార్లను భారతదేశంలో విక్రయిస్తోంది.అందువల్ల దిగుమతి సుంకం భారీ స్థాయిలో ఉంది.దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ మాట్లాడుతూ.. 'మీరు భారతదేశంలో Tesla ModelYని కొనుగోలు చేస్తే.. మీరు కంపెనీకి దాదాపు రూ. 33 లక్షలు చెల్లిస్తే.. ప్రభుత్వానికి రూ. 28 లక్షలు పన్నుగా చెల్లిస్తారు. ఇది పన్ను దోపిడీ కాకపోతే మరేమిటో నాకు తెలియదన్నారు. ఇక ఈ కారు కంటే దాదాపు సగం మనీ పన్ను రూపంలో కేంద్రానికి కట్టాలి. టెస్లాకు బదులుగా భారతదేశంలో దీనిని 'TAX-LA' అని పిలవాలి" అని మరొక వినియోగదారుడు చమత్కరించారు.
దిగుమతి సుంకం లేదా ఇతర పన్నుల కారణంగా Tesla Model Y ధర రెట్టింపు అయింది. రోడ్డు పన్ను, బీమా, GST మొదలైన వాటిని విడిగా వసూలు చేస్తారు. Tesla భారతదేశంలో ఉత్పత్తిని లేదా కనీసం అసెంబ్లీని ప్రారంభించకపోతే.. అది విజయవంతం కాదని మరొక నెటిజన్ తెలిపారు. కాగా టెస్లా ప్రస్తుతం భారతదేశంలో ప్రస్తుతం తన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం లేదు. చైనాలో తయారైన కార్లను ఇండియాకు తీసుకువచ్చి విక్రయిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ కారుపై చాలా పన్ను విధించబడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై 70 శాతం సుంకం ఉంది. 30 శాతం లగ్జరీ పన్ను కూడా ఉంది. భారతదేశంలో టెస్లా కార్లు ఖరీదైనవిగా మారడానికి ఇదే కారణం.
కంపెనీ దాని వెబ్‌సైట్‌లో ఈ కార్ల మీద ఫైనాన్సింగ్, EMI లేదా లీజు పథకం గురించి ఎటువంటి సమాచారాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.కస్టమర్ ఈ కారును సొంతం చేసుకోవాలనుకుంటే పూర్తి మొత్తం నగదు చెల్లించాలని కంపెనీ వెబ్ సైట్ ని బట్టి తెలుస్తోంది.అయితే భారతదేశం వంటి మధ్యతరగతి మార్కెట్‌లో.. వినియోగదారులు వాయిదాలలో కొనడానికి ఇష్టపడతారు. టెస్లా కంపెనీ నగదు ఎంపికతో మాత్రమే ప్రారంభించడం పరిమిత వ్యూహంగా పరిగణించబడుతుంది.
భారత ప్రభుత్వం టెస్లాకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఈ ధరల వ్యత్యాసానికి ప్రధాన కారణం దేశంలో ఉన్న దిగుమతి సుంకంగా చెప్పుకోవచ్చు. టెస్లా ప్రస్తుతం దేశంలోకి పూర్తిగా తయారైన కార్లను (CBUలు) దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ఇవి దేశంలోకి ఎంటర్ కావాలంటే అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సిందే. కారు CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ 40,000 వేల డాలర్లు దాటితే 100 శాతం విధిస్తారు. ఆ పరిమితి కంటే తక్కువ ధర గల కార్లకు 70 శాతం విధిస్తారు
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications