మారిషస్ మార్గం ద్వారా వచ్చే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పిఐ) అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులో మార్పులకు సంబంధించి భారత ప్రభుత్వం ఒక వివరణను ఇచ్చింది. ఈ మార్పులను ఇంకా అమలు చేయలేదని ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అంటే మారిషస్ రూట్‌లో ఉన్న ఎఫ్పీఐలు మునుపటిలాగానే పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందడం కొనసాగనున్నాయి..
భారత్, మారిషస్ మధ్య ఉన్న పన్నుల మినహాయింపు ఒప్పందంలో ఇటీవలి మార్పులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. మార్పులకు ఇంకా ఆమోదముద్ర వేయలేదని, నోటిఫై చేయలేదని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 90 కింద నోటిఫై చేసిన తర్వాత మార్పులు అమల్లోకి వస్తాయి. ప్రోటోకాల్‌లు అమలులోకి వచ్చే వరకు వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

మారిషస్ ఆధారిత ఎఫ్పీఐకు అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపులో మార్పు వార్తల తర్వాత మార్కెట్ సెంటిమెంట్ క్షీణించడం ప్రారంభించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ స్పష్టత వచ్చింది. పన్ను మినహాయింపు రద్దు వార్తల తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దేశీయ మార్కెట్ శుక్రవారం 1 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది.
ఏప్రిల్ 12తో ముగిసిన ట్రేడింగ్ వారం చివరి రోజున, బిఎస్‌ఇ సెన్సెక్స్ 793.25 పాయింట్ల (1.06 శాతం) నష్టంతో 74,244.90 పాయింట్ల వద్ద ముగిసింది. దానికి ఒకరోజు ముందు మార్కెట్ తొలిసారిగా 75 వేల పాయింట్ల స్థాయిని అధిగమించి సరికొత్త ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 75,124.28 పాయింట్లను సాధించింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 234.40 పాయింట్లు (1.03 శాతం) పడిపోయి 22,519.40 వద్దకు చేరుకుంది.
భారత్ లో మారిషస్ నుంచి పెట్టుబడి పెడితే పన్ను ఉండదు. దీనిపై ఇరు దేశాల మధ్య సంవత్సరాల క్రితం ఒప్పందం జరిగింది. అయితే మిగతా దేశాల వారు కూడా మీరిషస్ కేంద్రంగా భారత్ లో పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందుతున్నారు. దీని వల్ల నష్టపోవాల్సి వస్తుంది. దీన్న గుర్తించిన కేంద్రం ఈ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య మార్చి 7న ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications