నెల రోజుల క్రితం వరకు దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెట్టాయి. దాదాపు దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. కొన్ని ప్రాంతాల్లో రూ.120ని కూడా క్రాస్ చేసింది. అయితే గత నెలలో దీపావళి పర్వదినం సమయంలో పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి, సామాన్యులకు భారీ ఊరటను ఇచ్చింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి, వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు చాలాచోట్ల ఇప్పుడు రూ.100 దిగువకు పడిపోయాయి. పెట్రోల్, డీజిల్ పైన ఇటీవల ట్యాక్స్ తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు.

పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు మీద ఏమన్నారంటే
పెట్రోల్, డీజిల్ పైన పన్ను తగ్గించడం వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. ఇది ఆర్థికవ్యవస్థకు అండగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ముడి చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయని, వినియోగ డిమాండ్ మెరుగుపడిందని, గ్రామీణ డిమాండ్ స్థితిస్థాపకంగా ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్ను తగ్గింపు ప్రయివేటు పెట్టుబడులు పెరగడానికి కూడా దోహదపడతాయని శక్తికాంతదాస్ అన్నారు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
నాలుగో త్రైమాసికంలో సీపీఐ ద్రవ్యోల్భణం గరిష్టస్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని అంచనాలు ఉన్నాయని తెలిపారు. వృద్ధి ప్రేరణను విస్తృతం చేయడానికి ఆర్బీఐ అవసరమైన అనుకూల వైఖరికి కట్టుబడి ఉందన్నారు. అదృశ్య శక్తి కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశీయ ఆర్థిక దృక్పథంపై కాస్త ప్రభావం పడిందని తెలిపారు. FY22 సీబీఐ ద్రవ్యోల్భణ లక్ష్యం 5.3 శాతంగా పేర్కొన్నారు. అక్టోబర్-డిసెంబర్ మధ్య ద్రవ్యోల్భణ లక్ష్యం 4.5 శాతం నుండి 5.1 శాతానికి సవరించారు. జనవరి - మార్చి ద్రవ్యోల్భణం 5.8 శాతం నుండి 5.7 శాతానికి సవరించారు.

వృద్ధి, ద్రవ్యోల్భణ అంచనాలు
Q1FY23లో (వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం) జీడీపీ వృద్ధి అంచనాలను 17.2 శాతంగా పేర్కొన్నారు శక్తికాంత దాస్. Q2FY23 (వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం) జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతంగా అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1FY23) సీపీఐ అంచనాలు 5.2 శాతం, రెండో త్రైమాసికంలో (Q2FY23 ) 5 శాతంగా అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications