డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు పెడుతున్నారా..? అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి.. లాభపడండి..

Digital Gold: బంగారం ఒక మంచి పెట్టుబడి సాధనంగా చెప్పుకోవాలి. అందులోనూ ఇది భారతీయులకు ఎంతగానో ఇష్టమైనది కూడా. భారతీయ సంస్కృతిలో బంగారం యుగయుగాలుగా అంతర్భాగంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రజలు తమ కుటుంబ భవిష్యత్తు సురక్షితంగా ఉండేందుకు బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. ప్రజలు, ముఖ్యంగా మన దేశంలో యుగాల నుంచి బంగారాన్ని విశ్వసిస్తున్నారు. బంగారం వారి నమ్మకాన్ని నిలబెట్టిందనే చెప్పుకోవాలి. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా ఉండగల సామర్థ్యం తనకు ఉందనే విషయాన్ని బంగారం ఇప్పటికే అనేక సార్లు నిరూపించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ గోల్డ్ పెట్టుబడులకు ఎక్కువమంది మెుగ్గుచూపుతున్న వేళ ఈ విషయాలను వారు తప్పకుండా తెలుసుకోవాలి.

 పోర్ట్‌ఫోలియోకు బలాన్నిచ్చే బంగారం:

పోర్ట్‌ఫోలియోకు బలాన్నిచ్చే బంగారం:

ఒక పెట్టుబడిదారుడు తన పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులతో పాటు బంగారానికి కూడా సముచిత కేటాయింపులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోలో బంగారం కూడా ఉండటం వల్ల అది మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునేందుకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోకు బలాన్ని అందిస్తుంది కాబట్టి బంగారంపై కనీసం 7-15% మెుత్తం పెట్టుబడుల్లో కేటాయింపులు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియో అనేక ప్రతికూల సమయాలను ఎదుర్కొంటుంది, ఆ టఫ్ సమయాల్లో.. గోల్డ్ పనితీరు పోర్ట్‌ఫోలియోకు డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ ముద్దు.. ఎందుకంటే..

ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ ముద్దు.. ఎందుకంటే..

ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే సరిపోతుందిగా మరి సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఎందుకు అనే అనుమానం మీకు కలిగే ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్. దీనితో మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1) అధిక లిక్విడిటీ: ఎవరైనా ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా SGBలను లిక్విడేట్ చేయవచ్చు. భౌతిక బంగారాన్ని డబ్బుగా మార్చడానికి కొంత సమయం పడుతుంది.

2) GST ఉండదు: SGBలపై ప్రభుత్వం GST విధించదని మీరు తప్పక తెలుసుకోవలసిన విషయం. అయితే ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు దానిపై 3% GST చెల్లించాల్సి ఉంటుంది.

3) వడ్డీ ఆదాయం: సావరిన్ గోల్డ్ బాండ్ పెట్టుబడులకు ఏడాదికి 2.5% వడ్డీ ఆదాయం లభిస్తుంది. ధరల పెరుగుదల కారణంగా SGB ధరలు పెరగటంతో పాటు ఇన్వెస్టర్లకు రెగ్యులర్ ఇన్‌ఫ్లోను అందిస్తాయి. అందువల్ల ఈ పెట్టుబడులు మరింత ఆకర్షనీయంగా ఉంటాయి.

4) గోల్డ్ స్వచ్ఛత: ఫిజికల్ గోల్డ్ కొనుగోలు విషయంలో స్వచ్ఛత అనేక మందికి ఆందోళన కలిగింటే ఒక ప్రధాన అంశం. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)లో ఈ సమస్య అస్సలు ఉండదు.

డిజిటల్ పెట్టుబడి లాభాలు:

డిజిటల్ పెట్టుబడి లాభాలు:

డిజిటల్ బంగారాన్ని ఎంచుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ డబ్బును ఎలా ఆదా చేసుకోగలడనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. "ఒక పెట్టుబడిదారుడు ఫిజికల్ బంగారంలో ఎక్కువ కాలం పాటు SIP చేస్తే.. అతను ప్రతి నెలా 3% GST చెల్లిస్తున్నాడని తెలుసుకోవాల్సిన విషయం. కానీ.. SGBల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా టాక్స్ ఆదా అవుతుంది. దీనికి తోడు ఇన్వెస్టర్లు మేకింగ్ ఛార్జీలను కూడా ఆదా చేసుకోవచ్చు. పెట్టుబడిపై వడ్డీని కూడా లభిస్తుంది. SGBలు మెచ్యూరిటీ వరకు కొనసాగించినట్లయితే వాటి వల్ల వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను రహితమైనది. సో డిజిటల్ గా సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)లో పెట్టుబడి అనేక సానుకూల అంశాలతో కూడుకున్న లాభదాయకమైన పెట్టుబడి." దీనిని ఇన్వెస్టర్లు తెలివిగా ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+