For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైరస్ మిస్త్రీ వివాదంపై సుప్రీం కోర్టుకు టాటా సన్స్, ఇండక్ట్ తప్పదా?

|

టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమంచాలన్న నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తీర్పుపై టాటా సన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. NCLAT తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని టాటా సన్స్ కోరుతోంది. క్వార్టర్ 3 ఫలితాల నేపథ్యంలో జనవరి 9వ తేదీన టీసీఎస్ బోర్డు సమావేశం ఉంది. ఈ నేపథ్యంలో తక్షణమే స్టే కావాలని టాటా సన్స్ భావిస్తోంది.

టాటా సన్స్ వెంటనే మధ్యంతర స్టే కోరుకుంటోంది. కాబట్టి జనవరి 2వ తేదీన అప్పీల్ చేయనుందని తెలుస్తోంది. అయితే కోర్టుకు సెలవుల కారణంగా జనవరి 6వ తేదీన ఇందుకు సంబంధించి వాదనలు వినే అవకాశాలు ఉన్నాయి. అయితే సైరస్ మిస్త్రీ ఫ్యామిలీకి సంబంధించి టాటా సన్స్‌లో కొంత వాటా ఉంది. వీరు మాత్రం ఈ మధ్యంతర స్టేను వ్యతిరేకించవచ్చునని అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సైరస్ మిస్త్రీని టాటాలు ఇండక్ట్ చేసుకునే పరిస్థితులు ఉండవచ్చునని అంటున్నారు.

టాటా గ్రూప్ టాప్ పోస్ట్ మిస్త్రీదే: NCLAT తీర్పు, ఇది నా గెలుపు కాదు.. సైరస్ ట్వీట్టాటా గ్రూప్ టాప్ పోస్ట్ మిస్త్రీదే: NCLAT తీర్పు, ఇది నా గెలుపు కాదు.. సైరస్ ట్వీట్

Tatas to seek urgent relief ahead of January 9 TCS board meeting

NCLAT తీర్పును అమలు చేయాలని సైరస్ కుటుంబం నుంచి ఒత్తిళ్లు రావొచ్చునని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ప్రతి క్వార్టర్ ఫలితాలు విడుదల చేయడానికి కంపెనీలకు 45 రోజుల సమయం ఉంటుందని, కాబట్టి టాటా సన్స్‌కు ఫిబ్రవరి వరకు వేచి చూసే అవకాశముంటుందని చెబుతున్నారు.

English summary

సైరస్ మిస్త్రీ వివాదంపై సుప్రీం కోర్టుకు టాటా సన్స్, ఇండక్ట్ తప్పదా? | Tatas to seek urgent relief ahead of January 9 TCS board meeting

Tata Sons will move the Supreme Court to seek early interim relief from the tribunal order reinstating Cyrus Mistry ahead of the TCS board meeting scheduled for January 9 to consider Q3 results.
Story first published: Wednesday, January 1, 2020, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X