Tanishq News: దేశంలో అనేక వ్యాపారాల్లో కొనసాగుతున్న టాటా వ్యాపారాలపై ప్రజలందరికీ ఎంతో మక్కువ, నమ్మకం. నాణ్యత విషయంలో టాటాలు వెనక్కి తగ్గరు అనే పేరు వారికి ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు గ్రూప్ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇది పరోక్షంగా దేశంలోని కంపెనీల స్టాక్ లలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దివంగత మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకు ఎంతో ఇష్టమైన టైటాన్ కంపెనీ విస్తరణ గురించే. కంపెనీ తన అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా నగల వ్యాపారమైన తనిష్క్ బ్రాండ్ ను బంగ్లాదేశ్‌లోనూ విస్తరిస్తోంది. ఇందుకోసం తనిష్క్.. రిథమ్ గ్రూప్‌తో ఒక జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో బంగ్లాదేశ్ మార్కెట్‌లో తనిష్క్ స్టోర్స్ తళుక్కుమని కొనుగోలుదారులను ఆకట్టుకోనున్నాయి.

రెండు సంస్థల ప్రకటన ప్రకారం బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్‌లో తయారీ యూనిట్ ప్రారంభోత్సవంతో జాయింట్ వెంచర్ ప్రారంభమవుతుంది. వాస్తవానికి తనిష్క్ తన వ్యాపార ఉనినికి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే కంపెనీ యూఏఈ, యూకే, ఖతార్, సింగపూర్, ఒమన్ వంటి దేశాల్లో దాదాపు 17 స్టోర్లను నిర్వహిస్తోంది. అలాగే కంపెనీకి చెందిన టైటాన్ గడియారాల వ్యాపారం సార్క్, మెనా (పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా), ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త స్టోర్లను నెలకొల్పే పనిని వేగంగా నిర్వహిస్తున్న టాటా గ్రూప్ ఈ గ్రమంలో బంగ్లాదేశ్‌లో వస్త్ర రంగం నుంచి అనేక వ్యాపారాలకు విస్తరించిన ప్రముఖ కంపెనీ రిథమ్ ను తన భాగస్వామిగా ఎంచుకుంది.
ఈ జాయింట్ వెంచర్ పై టైటాన్ ఎండీ సికె వెంకటరామన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లోని ఆభరణాల పరిశ్రమను ఉన్నతీకరించడానికి, ప్రపంచానికి తనిష్క్ అత్యద్భుతమైన ఆభరణాల తయారీకి బంగ్లాదేశ్‌ను కేంద్రంగా మార్చడానికి రెండు సంస్థలు కలిసి తమ బలాన్ని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి టైటాన్ కంపెనీ అనేది టాటా గ్రూప్-తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఒక జాయింట్ వెంచర్.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications