Air India Express: టాటాలకు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రెండు రోజులుగా ఊహించని సమస్యను ఎదుర్కొంటోంది. విమానయాన సంస్థకు చెందిన ఒక విభాగంలోని దాదాపు 300 మంది ఉద్యోగులు ఏకకాలంలో సిక్ లీవ్ తీసుకోవటంతో పాటు ఫోన్లు స్విచాఫ్ చేసి కంపెనీకి షాక్ ఇచ్చారు. దీంతో కంపెనీ సేవలు ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యాయి.
విమానాలను నడిపేందుకు పూర్తి స్థాయిలో అవసరమైన క్రూ సిబ్బంది లేకపోవటంతో టాటా గ్రూప్ కంపెనీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిన్న దాదాపు 100 విమాన సేవలను రద్దు చేసింది. అయితే పరిస్థితులు ఇంకా సర్థుమణగకపోవటంతో నేడు దాదాపు 85 విమాన సేవలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ లైనర్ ప్రకటించింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగిన కంపెనీ దాదాపు 30 మందిని తొలగించి క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం కంపెనీ మెుత్తంగా 292 ఫ్లైట్ సర్వీసులను నిర్వహిస్తోందని తమకు ఎయ్రి ఇండియా సైతం 20 రూట్లలో సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన వ్యక్తులపై చర్యలు చేపట్టినట్లు కూడా కంపెనీ పేర్కొంది. విమానయాన సంస్థ ప్రయాణీకులకు వారి ఫ్లైట్ రద్దు చేయబడితే లేదా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే వారు వాట్సాప్ (+91 6360012345) లేదా airindiaexpress.comలో ఎటువంటి రుసుము లేకుండా పూర్తి వాపసు పొందవచ్చని వెల్లడించింది. లేదా తర్వాతి తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం మే 8న దాదాపు 20 మంది ఉద్యోగులకు తొలగింపు లేఖలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పంపినట్లు వెల్లడైంది. చివరి క్షణాల్లో కావాలని అనారోగ్య కారణాలు చూపుతూ సెలవు తీసుకున్న ఉద్యోగులతో కంపెనీ గతంలో కుదుర్చుకున్న ఉద్యోగ కాంట్రాక్టులను రద్దు చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు సిక్ లీవ్ పై వెళ్లిన క్రూ సిబ్బందికి కంపెనీ పంపిన మెయిల్ వెల్లడించింది. కొందరు ఉద్యోగులు చేసిన పని కారణంగా కంపెనీ పేరుప్రతిష్ఠలకు భంగం కలగటం, భారీ ఆర్థిక నష్టం, ఇబ్బందిని కలిగించినట్లు ఎయిర్‌లైన్ సంస్థ పేర్కొంది.


Click it and Unblock the Notifications