Flight Tickets: పండుగల దగ్గర పడుతున్న వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ సొంతూళ్లకు తిరిగి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాటాలకు చెందిన ప్రముఖ విమాన సంస్థ విస్తారా శుభవార్త చెప్పింది.
ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ తక్కువ రేటుతో విమానంలో ప్రయాణాలను ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ నేడు మూడు రోజుల విక్రయాలను ప్రకటించింది. స్పెషల్ సేల్ కింద మీరు రూ.1,999కే విమానంలో ప్రయాణించొచ్చు. ఆఫర్ కింద ప్రయాణికులు ఈరోజు రాత్రి అంటే నవంబర్ 7వ తేదీ నుంచి 9 నవంబర్ 2023 మధ్య టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కింద నవంబర్ 7 నుంచి ఏప్రిల్ 10, 2024 వరకు ప్రయాణికులు టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

ఆఫర్ సేల్ కింద ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ టిక్కెట్లపై తగ్గింపులను విస్తారా అందిస్తోంది. వన్-వే దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ.1,999, ప్రీమియం ఎకానమీకి రూ.2,799, బిజినెస్ క్లాస్‌కు రూ.10,999గా ప్రారంభమౌతాయి. ప్రయాణికులు టిక్కెట్లను విస్తారా వెబ్‌సైట్, ట్రావెల్ యాప్స్, విస్తారా ఎయిర్‌పోర్ట్ టికెట్ ఆఫీసులు, ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో డైరెక్ట్ ఛానెల్ డిస్కౌంట్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు/సాఫ్ట్ ప్రయోజనాలు వర్తించవు. లిమిటెడ్ సీట్లను మాత్రమే సేల్ ద్వారా కంపెనీ అందుబాటులో ఉంచుతోంది.
ప్రత్యేక సేల్‌తో వేడుకలను ప్రారంభించడం సంతోషంగా ఉందని కంపెనీ
చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ వెల్లడించారు. దీని ద్వారా వినియోగదారులకు తగ్గింపు ధరలతో భారతదేశంలోని అత్యుత్తమ విమానయాన సంస్థల్లో ప్రయాణించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కస్టమర్‌లు విస్తారాను తమ ప్రాధాన్య ఎయిర్‌లైన్‌గా ఎంచుకోవడం కొనసాగిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ పండుగ సీజన్‌లో చిరస్మరణీయమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ప్రయాణం చేయాలని ఆకాంక్షించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications