Noel Tata News: రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్ చైర్మన్ పదవికి నోయెల్ టాటా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ జరగని మార్పులు లోలోపలే జరిగిపోతున్నాయి. టాటా గ్రూప్ చైర్మన్ నోయెల్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ బోర్డులో నియమితులైనట్లు శుక్రవారం ఆన్‌లైన్ రిజల్యూషన్ పాస్ చేయబడింది.
దీంతో 2011 తర్వాత ఏకకాలంలో టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ రెండింటి బోర్డుల్లో నియమితులైన తొలి టాటా కుటుంబ సభ్యునిగా నిలిచారు. అయితే ఈ నియామకం తర్వాత నోయెల్ టాటా ప్రస్తుత టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కలిశారు. నోయెల్ టాటా కలవటం ఆరోగ్యకరమైన వర్క్ రిలేషన్ పెంపొదిస్తుందని అందరూ భావిస్తున్నారు. దీనికి ముందు కేవలం రతన్ టాటా మాత్రమే ఇలా ఏకకాలంలో రెండు బోర్డుల్లో సభ్యునిగా వ్యవహరించారు. టాటా సన్స్ బోర్డులో నోయెల్ టాటా చోటు దక్కించుకోవటంతో టీవీఎస్ ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్, మాజీ రక్షణ మంత్రిత్వ శాఖ బ్యూరోక్రాట్ విజయ్ సింగ్‌తో సహా ముగ్గురు టాటా ట్రస్ట్ నామినీ డైరెక్టర్లకు బలం పెరిగింది.

వాస్తవానికి టాటా సన్స్‌కు చైర్మన్ కావాలనేది నోయెల్ టాటాకి చిరకాల కోరిక. అయితే రతన్ టాటా బతికి ఉన్న సమయంలోనే ఈ పదవిని దక్కించుకోవటం కోసం రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యాడు. మెుదటి సారి ఆ స్థానాన్ని రతన్ టాటా సైరస్ మిస్త్రీకి అందించగా, రెండవసారి టీసీఎస్‌కి చెందిన ఎన్ చంద్రశేఖరన్ ఆ పాత్రకు ఎంపికచేయబడ్డారు. రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ ఛైర్మన్ పదవిని పొందినప్పటికీ.. టాటా సన్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టలేని పరిస్థితిని రతన్ టాటా సృష్టించారు. టాటా సన్స్ బోర్డులో మూడవ వంతు మంది డైరెక్టర్లను కూడా నియమిస్తున్నందున టాటా ట్రస్ట్‌లు సమూహంపై పరోక్ష నియంత్రణను కలిగి ఉన్నారు. ఆ నియామకాలు ప్రత్యేక వీటో అధికారాలను కలిగి ఉంటాయి.
ప్రస్తుతం టాటా సన్స్ బోర్డులో ప్రస్తుతం తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇందులో చంద్రశేఖరన్‌తో సహా ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, నోయెల్ టాటా , శ్రీనివాసన్, సింగ్‌లతో కూడిన ముగ్గురు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో పాటుగా నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు ఉన్నారు. వీరు విస్తారమైన టాటా వ్యాపార సామ్రాజ్యం కింద ఉన్న కన్జూమర్ గూడ్స్, హోటల్స్, ఆటోమెుబైల్స్, ఎయిర్ లైన్స్ రంగాల్లోని 30 సంస్థల పనితీరును చూసుకుంటారు. ప్రస్తుతం టాటా సన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్ నోయెల్ టాటా చేరికతో కంపెనీ కార్యకలాపాలు, టాటా ఫ్యామిలీ మ్యానిఫోల్డ్ మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుందని అందరూ నమ్ముతున్నారు.
వాస్తవానికి టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్టులకు 66 శాతం వాటా ఉండటంతో నోయెల్ టాటా చాలా కీలకంగా మారనున్నారు. పరోక్షంగా మెుత్తం టాటా వ్యాపారాలపై నోయెల్ పట్టు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రతన్ టాటా మేనేజ్‌మెంట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు.. ఒకే వ్యక్తి ఏకకాలంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉండకూడదని ప్రత్యేక నిబంధన పెట్టారు. అందువల్ల ప్రస్తుతం నోయెల్ టాటా టాటా సన్స్ బోర్డులో సభ్యత్వాన్ని మాత్రమే పొందగలిగారు. చైర్మన్ పదవి మాత్రం ఎన్ చంద్రశేఖరన్ చేతిలోనే కొనసాగుతుంది. ఒకవేళ టాటా సన్స్ చైర్మన్ పదవి కావాలనుకుంటే నోయెల్ టాటా అందుకోసం పై షరతుకు అనుగుణంగా టాటా ట్రస్ట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
టాటా గ్రూప్ లో నోయెల్ టాటా అనుబంధం దాదాపు 40 ఏళ్ల ప్రయాణంతో కూడుకున్నది. ఈ క్రమంలో ఆయన ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా స్టీల్ అండ్ టైటాన్ వైస్ ఛైర్మన్‌గా సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు బోర్డు సభ్యునిగా కూడా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులలో ట్రస్టీగా ఉన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications