Tata Car: కిలోమీటరుకు ఒక్క రూపాయి ఖర్చు.. మతిపోగొడుతున్న టాటా కార్.. నేటి నుంచే బుకింగ్స్..
Tata Car: దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన కస్టమర్ల కోసం ఎల్లప్పుడూ సరికొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. పైగా ఈ కంపెనీ ఎక్కువగా మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని అనేక కార్లను ప్రవేశపెడుతుంటుంది. అలా తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు తయారుచేయబడిన కారు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కారు..
టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చిన బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు Tiago EV బుక్కింగ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. టియాగో EV టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి వచ్చిన మూడవ ఎలక్ట్రిక్ కారు. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే Nexon EV, Tigor EVలు ఉన్నాయి. కొత్తగా ప్రవేశిస్తున్న ఈ కారుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

ఖర్చు తగ్గించే కార్..
Tiago EV రోడ్డుపై ప్రయాణ ఖర్చును భారీగా తగ్గిస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది. పెట్రోల్ మోడల్ కార్లతో పోల్చితే కిలోమీటరుకు దాదాపు రూ.6.50 ఆదా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించి కంపేరిటివ్ డేటాను కంపెనీ సమర్పించింది. ఈ రేంజ్ పెట్రోల్ కారును 1000 కిలోమీటర్లు నడపటానికి రూ.7,500 ఆయిల్ ఖర్చవుతుందని, అదే టియాగో ఈవీని ఇదే దూరం నడపటానికి రూ.1,100 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. అలా వినియోగదారులు రూ.6,500 ఆదా చేసుకోవచ్చు.

కారు బుక్ చేసుకోవటం ఎలా..?
Tiago EV బుకింగ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతోంది. కస్టమర్లు టియాగో ఎలక్ట్రిక్‌ను ఏదైనా అధీకృత టాటా మోటార్స్ డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్‌లో రూ.21,000 టోకెన్ అమౌంట్ డిపాజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు డెలివరీ జనవరి 2023 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ చెబుతోంది. Tiago EV డిసెంబర్ నుంచి టెస్ట్ డ్రైవ్‌లకు అందుబాటులో ఉంటుంది. ఇది జిప్‌ట్రాన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుందని, ధర రూ.8.49 లక్షల నుంచి 11.79 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే..
Tiago EV IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్, 24kWh బ్యాటరీ ప్యాక్‌తో సహా బహుళ ఛార్జింగ్ ఎంపికలతో అందించబడుతుంది. Tiago EV 24kWh బ్యాటరీ ప్యాక్‌తో 315 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ 19.2kWh బ్యాటరీ ప్యాక్‌తో టియాగో EVని కూడా పరిచయం చేసింది. మోటర్, బ్యాటరీలకు కంపెనీ 8 ఏళ్లు లేదా 1,60,000 కిమీల వారంటీని అందిస్తోంది. DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి వాటిని 57 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఇన్ని సూపర్ ఫ్యూచర్స్ ఉండటంతో అనేక మంది కస్టమర్లు ఈ కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications