భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఇప్పుడు మళ్లీ అంతర్గత రాజకీయాల వలలో చిక్కుకుని విలవిలలాడుతోంది. Tata గ్రూప్‌కు హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో మెజారిటీ వాటా టాటా ట్రస్ట్స్ కు ఉంది. అయితే ఈ ట్రస్ట్స్ ఇప్పుడు ట్రస్టీల నియామకాలపై తీవ్ర విభేదాలు ఎదుర్కొంటున్నాయి.
సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT), సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT)ల ట్రస్టీగా ఉన్న మెహ్లి మిస్త్రీ పదవీకాలం అక్టోబర్ 28న ముగుస్తోంది. 2022 నుండి ఈ రెండు ట్రస్ట్‌ల ట్రస్టీగా ఉన్న ఆయనను మళ్లీ నియమించాలా వద్దా అనే అంశంపై బోర్డు సభ్యులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం, టాటా ట్రస్ట్స్ CEO సిద్ధార్థ్ శర్మ... మెహ్లి మిస్త్రీ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించారు. ట్రస్టీలు డారియస్ ఖంబట్టా, ప్రమిత్ జవేరి, జెహంగీర్ హెచ్.సి. జెహంగీర్ ఈ ప్రతిపాదనకు తమ సమ్మతిని తెలిపారని వర్గాలు తెలిపాయి. అయితే, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ ఇంకా ఆమోదం తెలియజేయలేదు.

మూలాల ప్రకారం, Tata ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ మిస్త్రీని తిరిగి నియమించే ఆలోచనలో లేరు. ఈ నిర్ణయాన్ని ఈ వారం ప్రకటించే అవకాశం ఉంది. అయితే మిస్త్రీకి మద్దతుగా కొంతమంది ట్రస్టీలు కూడా ఉన్నారు. డారియస్ ఖంబట్టా, ప్రమిత్ జవేరి,జెహంగీర్ హెచ్‌సీ జెహంగీర్ ఇప్పటికే మిస్త్రీ పక్షాన నిలిచారు.
మెహ్లి మిస్త్రీని తిరిగి నియమించకపోతే చట్టపరమైన పోరాటం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.మిస్త్రీ, నోయెల్ టాటా, శ్రీనివాసన్, విజయ్ సింగ్‌ల మధ్య రాజకీయ విభేదాలు చాలా కాలంగా ఉన్నాయి. సాధారణంగా టాటా ట్రస్ట్స్‌లో నిర్ణయాలు ఏకగ్రీవంగా (unanimously) తీసుకోవడం సంప్రదాయం. కానీ సెప్టెంబర్ 11న విజయ్ సింగ్‌ను టాటా సన్స్ బోర్డు నుండి తొలగించినప్పుడు ఈ సంప్రదాయం మొదటిసారిగా విచ్ఛిన్నమైంది.
ఇప్పుడు మిస్త్రీ రీ-అపాయింట్‌మెంట్‌పై ఓటింగ్ జరగనుంది.అయితే మెజారిటీ ఓటుతో నిర్ణయం తీసుకోవచ్చా అనే విషయంపై స్పష్టత లేదు. రతన్ టాటా జీవించిన సమయంలో, ఎప్పుడూ ఇలాంటి ఓటింగ్ జరగలేదు. అందువల్ల ఇది ట్రస్ట్స్ చరిత్రలో కొత్త పరిస్థితి అని చెప్పవచ్చు.
గత వారం మెహ్లి మిస్త్రీ, వేణు శ్రీనివాసన్‌ను ట్రస్టీగా తిరిగి నియమించడానికి షరతులతో కూడిన ఆమోదం (conditional approval) ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆమోదం ఇచ్చాక దాన్ని వెనక్కి తీసుకోవడం చట్టబద్ధం కాదని ఓ ట్రస్టీ అన్నారు. లా ఫర్మ్ క్యాప్‌స్టోన్ లీగల్ మేనేజింగ్ పార్ట్నర్ ఆశిష్ కె. సింగ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ట్రస్ట్ నియమావళిలో స్పష్టమైన ప్రావధానం లేకపోతే షరతులతో కూడిన ఆమోదం చెల్లదని పేర్కొన్నారు.
మెహ్లి మిస్త్రీ ఎం. పల్లోంజీ గ్రూప్ కు ప్రమోటర్. ఈ గ్రూప్ టాటా ట్రస్ట్స్ తర్వాత టాటా సన్స్‌లో రెండవ అతిపెద్ద వాటాదారు (18.37%). టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్ వంటి సంస్థలు ఆయన వ్యాపార భాగస్వామ్యాలతో అనుబంధంగా ఉన్నాయి. అదనంగా, ఆయన బ్రీచ్ కాండీ హాస్పిటల్ ట్రస్ట్ కు ట్రస్టీగా ఉన్నారు.
మిస్త్రీ పునర్నియామకం జరగకపోతే.. ఇది టాటా ట్రస్ట్స్ అంతర్గత రాజకీయాల్లో మరొక పెద్ద విభేదానికి నాంది అవుతుంది. రతన్ టాటా మరణానంతరం, సంస్థలో నాయకత్వ ఖాళీ, భిన్నాభిప్రాయాలు బహిర్గతమవుతున్నాయి. టాటా ట్రస్ట్స్‌లోని ఈ తాజా వివాదం, భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామిక సమూహంలో శాంతి చిహ్నాలు మళ్లీ కదలిక చెందుతున్నాయన్న సంకేతాన్ని ఇస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications