Tata Technologies: రెండు దశాబ్ధాల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో కొత్తగా లిస్టింగ్ కోసం ఐపీవోగా ఇన్వెస్టర్ల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో గ్రేమార్కెట్లోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో టాటా టెక్నాలజీ షేర్ రూ.290 ప్రీమియం రేటు పలుకుతోంది. ఇది వాస్తవంగా కంపెనీ సబ్ స్క్రిప్షన్ కోసం ప్రకటించిన రేటుకు అధికం. ఈ లెక్కన షేర్లు మార్కెట్లో లిస్టింగ్ జరిగితే ఐపీవోలో షేర్లు అలాట్ అయిన పెట్టుబడిదారులు లక్షాధికారులుగా మారిపోనున్నారు. నవంబర్ 21న ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో ఐపీవోల ట్రెండ్ కొనసాగుతున్నందున.. టాటా టెక్నాలజీస్ ఐపీవో ప్రారంభం కాకముందే అద్భుతమైన స్పందనను పొందుతున్నట్లు గ్రేమార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. గ్రే మార్కెట్‌లో టాటా టెక్నాలజీస్ షేర్లు రూ.290 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. టాటా టెక్నాలజీస్ కంటే ముందు చివరిగా టాటా గ్రూప్ 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐపీవోను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మార్కెట్లో లిస్టింగ్ కోసం అరంగేట్రం చేయనున్న టాటా టెక్నాలజీస్ ఆటోమోటివ్ పరిశ్రమలో బలమైన పట్టును కలిగి ఉంది. కంపెనీ ఆదాయంలో ఈ పరిశ్రమ వాటా 75 శాతంగా ఉండటం గమనార్హం. టాటా టెక్నాలజీస్ IPO అనేది ఆఫర్ ఫర్ సేల్. దీనిలో ప్రస్తుత వాటాదారులు 9.57 కోట్ల షేర్లను విక్రయిస్తారు. ఇది కంపెనీ మొత్తం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 23.60 శాతంగా ఉంది. వాస్తవానికి టాటా టెక్నాలజీస్ కంపెనీ 1988లో స్థాపించబడింది. పూణే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాల్లో 12,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇది ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్, హెవీ మెషినరీ పరిశ్రమల్లోని వినియోగదారులకు ఇంజనీరింగ్ సేవలను అందిస్తోంద.


Click it and Unblock the Notifications