IPO News: ఎంజాయ్.. పండగో.. గంటలో టాటా టెక్నాలజీస్ ఐపీవో సునామీ..!

IPO News: టాటా గ్రూప్ నుంచి దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత ఒక కంపెనీ ఐపీవో కోసం మార్కెట్లోకి నేడు సబ్ స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. అయితే దీనిలో పాల్గొనేందుకు ఇన్వెస్టర్ల నుంచి భారీ పోటీ నెలకొంది.

రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరుచుకున్న టాటా టెక్నాలజీస్ ఐపీవో ప్రారంభమైన మెుదటి గంటలోనే రికార్డులు సృష్టించింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. ఉదయం 10.53 గంట సమయంలో ఐపీవో మెుత్తంగా 6,36,35,070 ఈక్విటీ షేర్ల కోసం బిడ్‌లను అందుకుంది. ఇది వాస్తవంగా కంపెనీ ఆఫర్ చేసిన 4,50,29,207 ఈక్విటీ షేర్ల కంటే 1.41 రెట్లు అధికం. కేవలం గంటలోపే ఐపీవో ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ అందుకోవటం సునామీగా మారింది.

Tata Technologies IPO over subscribed in first one hour after opening, GMP at 355 per share

అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు టాటా టెక్నాలజీస్ ఐపీవోకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఈ కేటగిరీ అత్యధికంగా 1.95 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడింది. అలాగే నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 1.54 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ కాగా.. రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల పోర్షన్ పూర్తిగా 1.11 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. అలాగే కంపెనీ టాటా మోటార్స్ ఉద్యోగుల కోసం రిజర్వు చేసిన మెుత్తం సైతం పూర్తిగా సభ్యత్వం పొందింది.

ఇదిలా ఉండగా మరోపక్క గ్రేమార్కెట్లో సైతం కంపెనీ షేర్లు ఊహించని పనితీరును కనబరుస్తోంది. ఇన్వెస్ట్ గ్రెయిన్ ప్రకారం టాటా టెక్నాలజీస్ ఐపీవో ఉదయం 10 గంటల సమయానికి గ్రేమార్కెట్ ధర రూ.355గా నమోదైంది. వాస్తవానికి కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ గమనిస్తే కంపెనీ రూ.475 నుంచి రూ.500గా నిర్ణయించింది. ఈ లెక్కన ప్రస్తుత గ్రేమార్కెట్ ధర ప్రకారం లిస్టింగ్ సమయంలో షేర్ ధర రూ.855గా ఉండనుంది. నిపుణుల అంచనా ప్రకారం లిస్టింగ్ నాటికి గ్రేమార్కెట్ ప్రీమియం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వివిధ బ్రోకరేజ్ సంస్థలు సైతం బలంగా BUY రేటింగ్ కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+