Tata IPO: టాటా టెక్నాలజీస్ ఐపీవోకు లైన్ క్లియర్.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
Tata IPO: దాదాపు 20 ఏళ్ల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లోకి టాటా గ్రూప్ తన కంపెనీని ఐపీవో ఫ్లోటింగ్ కోసం తీసుకొస్తోంది. దీంతో ఈ కంపెనీ షేర్ల కోసం అనేక మంది ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
టాటా టెక్నాలజీస్ ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలపటంతో ఇన్వెస్టర్ల ఎదురుచూపులకు బ్లేక్ పడింది. రెండు దశాబ్ధాల తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న మెుదటి పబ్లిక్ ఇష్యూ కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లుగా ఉన్న టాటా మోటార్స్ తన 81.13 మిలియన్ షేర్లను, ఆల్ఫా TC హోల్డింగ్స్ తన 9.72 మిలియన్ల షేర్లతో పాటు టాటా క్యాపిటల్ కు చెందిన 4.86 మిలియన్ల షేర్లను విక్రయిస్తున్నాయి.

ఐపీవో ద్వారా మెుత్తం 95.71 మిలియన్ షేర్ల విక్రయం ఓఎఫ్ఎస్ రూపంలో జరుగుతోంది. ఇందులో మెజారిటీ వాటా అంటే 74.69 శాతాన్ని టాటా మోటార్స్ హోల్డ్ చేస్తోంది. ఈ ఐపీవోకు JM ఫైనాన్షియల్ లిమిటెడ్, BofA సెక్యూరిటీస్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఇదే సమయంలో సెబీ మరో రెండు కంపెనీల ఐపీవోలకు సైతం ఆమోదం తెలిపింది. SBFC ఫైనాన్స్ లిమిటెడ్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ లిమిటెడ్ సైతం తమ ఐపీవోలను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. SBFC ఫైనాన్స్ మార్చిలో SEBIకి డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను రీఫైల్ చేసింది. ఈ క్రమంలో తన ఐపీవో నిధుల సమీకరణ లక్ష్యాన్ని రూ.1,600 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు తగ్గించింది. ఇందులో రూ.750 కోట్ల తాజా ఇష్యూ ఉంటుండగా.. రూ.450 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ఉంటుందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications