మూడో త్రైమాసిక ఫలితాల్లో పుంజుకున్న టాటా స్టీల్స్ లిమిటెడ్ .. క్యూ3 లాభం రూ. 4,010.94 కోట్లు
టాటా స్టీల్ లిమిటెడ్ గత త్రైమాసికంలో నష్టాల బాట నుండి , ప్రస్తుతం అక్టోబర్-డిసెంబర్ మూడవ త్రైమాసికంలో తిరిగి పుంజుకుంది , ఆదాయం పెరిగిన నేపథ్యంలో ఈ త్రైమాసికంలో రూ .4,010.94 కోట్ల ఏకీకృత లాభం పొందింది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ 1,228.53 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసినట్లు టాటా స్టీల్ బిఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. ప్రస్తుతం కాస్త నష్టాల నుండి బయటపడటం సంస్థకు ఊరట నిచ్చింది .
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ కాలంలో, మొత్తం ఆదాయం ఏడాది క్రితం రూ .35,613.34 కోట్ల నుంచి రూ .39,809.05 కోట్లకు పెరిగింది. దీని ఖర్చులు రూ .34,183.18 కోట్లు, 2019-20 అక్టోబర్‌లో డిసెంబర్ 35,849.92 కోట్ల రూపాయలు.

ఈరోజు స్టాక్ మార్కెట్లో టాటా స్టీల్ లిమిటెడ్ షేర్ ప్రారంభ ధర 710 రూపాయలతో మొదలు కాగా, ఒక దశలో రూ 724. 50 పైసల కు పెరిగింది . మార్కెట్ ముగిసే సమయానికి రూ 690. 25 పైసలు వద్ద క్లోజ్ అయింది. దీంతో ఈ రోజు దాదాపు 8.95 రూపాయల నష్టంతో టాటా స్టీల్ లిమిటెడ్ ఉంది.
ఆరు రోజులపాటు భారీ లాభాలతో ర్యాలీ కొనసాగిన స్టాక్ మార్కెట్లు నిన్న భారీగా ఒడిదుడుకులను చవిచూశాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభం అయినప్పటికీ గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి . తిరిగి పుంజుకున్నా మళ్లీ అదే ధోరణి స్టాక్ మార్కెట్ లలో కనిపించింది . ఇలా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ బి ఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లు క్షీణించి 51187 వద్ద ముగిసింది . ఎన్ఎస్ఈ నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 15053 వద్ద క్లోజ్ అయ్యింది .


Click it and Unblock the Notifications