Tata Steel: విశ్వవ్యాప్తంగా పేరుగాంచిన, దేశం గర్వించదగ్గ సంస్థ టాటా గ్రూప్. విశ్వసనీయతకు మారుపేరుగా పలు విభాగాల్లో సేవలు అందిస్తోంది. గ్రూపు కంపెనీల్లోని టాటా స్టీల్ పలు దేశాల్లో ఆపరేట్ చేస్తోంది. కాగా UKలో ప్రస్తుతం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లను ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ లతో రిప్లేస్ చేయాలని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల వేలాది ఉద్యోగాలు పోతాయని కార్మిక యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని భావించిన సదరు సంస్థ.. అగ్రెసివ్ స్టెప్ తీసుకుని ఆశ్చర్యపరిచింది.
UKలోని ఉద్యోగుల సంఘంపై టాటా స్టీల్ చట్టపరమైన చర్యను ప్రారంభించింది. కార్మికుల సమ్మె నిర్ణయాన్ని ఏకపక్షంగా పేర్కొంది. పోర్ట్ టాల్బోట్ ఫెసిలిటీలో కార్యకలాపాలను ముందుగానే షట్‌డౌన్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్ణయించిన దానికంటే 3 నెలలు ముందుగానే బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేయాలని టాటా స్టీల్ యోచిస్తోంది. ఈ చర్యను ఖండిస్తూ జూలై 8న యునైట్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీనిని ఒక సుదీర్ఘమైన బెదిరింపుగా అభివర్ణించింది. వివాదాన్ని పరిష్కరించేందుకు టాటా స్టీల్ టాప్ మేనేజ్‌మెంట్ జోక్యం చేసుకోవాలని యూనియన్ కోరింది.

'జూలై 8 నుంచి ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిస్తామని యునైట్ యూనియన్ ప్రకటించింది. యునైట్ బ్యాలెట్ చెల్లుబాటును సవాలు చేయడానికి మేము దురదృష్టవశాత్తు చట్టపరమైన చర్యను ప్రారంభించవలసి వచ్చింది' అని టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజులలో సమ్మె జరుగుతున్న వేళ ఆస్తులను సురక్షితంగా మరియు స్థిరంగా నిర్వహించలేని పక్షంలో ఆపరేషన్స్ పాజ్ చేయడం లేదా ఆపడం తప్ప మాకు వేరే మార్గం ఉండదని తేల్చి చెప్పింది.
'కంపెనీ తన కార్యకలాపాలను మూసివేయడం వల్ల సరఫరా గొలుసు అంతటా దాని ప్రభావం ఉంటుంది. భారీ ఖర్చు సహా పనికి అంతరాయం కలుగుతుంది. అయితే సైట్‌లలోని వ్యక్తుల భద్రతే మాకు ప్రాధాన్యం. సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉద్యోగులకు మద్దతుగా ప్యాకేజీలు, శిక్షణ మరియు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ ఇటీవల మమ్మల్ని కోరింది. అయితే తాజా బెదిరింపులు మమ్మల్ని నిరోధించలేవు' అని యునైట్ ప్రధాన కార్యదర్శి షారన్ గ్రాహం ఒక ప్రకటనలో తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications