Tata News: 38 మందిని ఉద్యోగం నుంచి పీకేసిన టాటా గ్రూప్.. టీసీఎస్ తరహాలో.. ఎందుకంటే..
Tata Steel: క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీపడని సంస్థ టాటా గ్రూప్. గత నెలలో ఉద్యోగాలు పొందేందుకు కొందరు తాయిలాలు తీసుకున్న విషయం బయటకు రావటంతో టీసీఎస్ చర్యలు చేపట్టింది.
దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ గత ఆర్థిక సంవత్సరంలో దుష్ప్రవర్తనకు పాల్పడిన 38 మంది ఉద్యోగులను తొలగించిందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కంపెనీ AGMలో తెలిపారు. వీరిలో 35 మంది సైతిక ప్రవర్తన కారణంగా తొలగించబడగా.. మిగిలిన ముగ్గురిని లైంగిక దుష్ప్రవర్తన కారణంగా ఉద్యోగాల నుంచి టాటా స్టీల్ తొలగించిందని వెల్లడించారు.

విజిల్‌బ్లోయర్ ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత లోపాలను కంపెనీ దృష్టికి తీసుకువెళ్లామని టాటా గ్రూప్ చైర్మన్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మెుత్తం 875 ఫిర్యాదులు అందగా వాటిలో 158 విజిల్‌బ్లోయర్‌లకు సంబంధించినవి, 48 భద్రతకు, 669 హెచ్‌ఆర్ అండ్ ప్రవర్తన సంబంధమైనవిగా వెల్లడైంది. ఉద్యోగులు తాము ఎదుర్కొనే ఎలాంటి సమస్య గురించైనా ఫిర్యాదు చేసేందుకు తాము ప్రోత్సహిస్తున్నామని చంద్రశేఖరన్ ఈ సందర్ఫంగా వెల్లడించారు.
గత కొన్ని వారాలుగా టాటా గ్రూప్ కంపెనీ అయిన టీసీఎస్‌లో రూ.100 కోట్లకు పైగా విలువైన ఉద్యోగాల కుంభకోణం బయటపడిన సంగతి తెలిసిందే. RMG గ్లోబల్ హెడ్, ES చక్రవర్తి, ఇతర ఉన్నత HR ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలకు బదులుగా స్టాఫింగ్ సంస్థల నుంచి కమీషన్‌లను స్వీకరిస్తుననట్లు కంపెనీలోని ఒక విజిల్‌బ్లోయర్ కంపెనీ CEO, COOకి లేఖ రాయటంతో అసలు విషయం బయటపడింది. దీంతో టీసీఎస్ 6 స్టాఫింగ్ సంస్థలపై వేటు వేసింది. కొందరు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. ఇలాంటి చర్యలు తనను తీవ్రంగా బాధించిందని చంద్రశేఖరన్ తెలిపారు.


Click it and Unblock the Notifications