tata steel: లాభాల పంట పండిస్తుందని ఊహించిన ఓ స్టాక్.. పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంచనా వేసిన లాభాల కంటే రెండితలు నష్టాలను నమోదు చేసింది. అది టాటా గ్రూపు కంపెనీ కావడం మరింత షాక్ ఇచ్చింది. గతేడాది తన విభాగంలో అత్యంత మెరుగైన నంబర్లను పోస్ట్ చేసి, ఇప్పుడు చతికిల పడింది. ఆ కంపెనీ ఏంటి, ఎందుకు అంచనాలు అందుకోవడంలో విఫలమైందో చూద్దాం..

అనుకున్నదొకటీ.. అయిందొకటి:
గత డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికిగాను ఫిబ్రవరి 6న టాటా స్టీల్ ఫలితాలను విడుదల చేసింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, 2 వేల 2 వందల కోట్లకు పైగా నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయానికి దాదాపు 9 వేల 5 వందల కోట్లు లాభాన్ని ఆర్జించింది. YoY ఆదాయం 6.08 శాతం తగ్గి, 60 నుంచి 57 వేల కోట్లకు పడిపోయిందని ఎక్స్ఛేంజి ఫైలింగ్ లో తెలిపింది. 7 శాతం మార్జిన్ తో EBITDA 4 వేల కోట్లకు పైగా ఉందని వెల్లడించింది.

భారీగా తగ్గిన నికర లాభం:
కంపెనీ నికర లాభం 88 శాతం అంటే QoQ 24.3 శాతం తగ్గి రూ. 1,146 కోట్లకు చేరవచ్చని.. ఓ ప్రముఖ పోల్ లో పాల్గొన్న బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. కానీ దాదాపు రెట్టింపు నష్టాలతో టాటా స్టీల్ షాక్ ఇచ్చింది. కంపెనీ నికర రుణం రూ. 71,706 కోట్లు కాగా.. EBITDAతో పోలిస్తే 1.76 రెట్లు, ఈక్విటీకి 0.65 రెట్లుగా ఉంది.

ఐరోపాలో మందగమనే కొంపముంచిందా..?
యూరప్‌లో రియలైజేషన్స్ మరియు స్ప్రెడ్‌లలో భారీ తగ్గుదల వల్ల తమ లాభాలు ప్రభావితమయ్యాయని కంపెనీ తెలిపింది. "భారత్ లో ముడిసరుకు ధరలు తగ్గాయి కానీ స్టీల్ ధరలు సైతం తగ్గాయి. తద్వారా Q2లో పెట్టుకున్నమార్జిన్ 16 శాతాన్ని Q3లో 18కి పెంచినా ఉపయోగం లేకుండా పోయింది. ఐరోపా మార్కెట్ లో కార్యకలాపాలు మందగించడం, ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల ఊహించిన నంబర్లు సాధించలేకపోయాం" అని టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కౌశిక్ ఛటర్జీ అన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు:
దేశీయంగా 4.74 మిలియన్ టన్నులు డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అందులో 11 శాతం వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది. ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL) తన కార్యకలాపాలు ప్రారంభించిందని ప్రకటించింది. దాదాపు 1 MTPA సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నట్లు చెప్పింది. ఈ త్రైమాసికంలో క్యాపెక్స్‌పై రూ.3,632 కోట్లను ఖర్చు చేసినట్లు కంపెనీ పేర్కొంది. కళింగనగర్‌లో 6 MTPA ప్లాంట్ ను దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. 2.2 MTPA కోల్డ్ రోల్ మిల్ కాంప్లెక్స్, 5 MTPA విస్తరణ పనులు కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

Stock market: సెన్సెక్స్ పతనం.. కానీ రికవరీ మొదలైందా? నేటి మార్కెట్ టాప్ విన్నర్స్ వీరే!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications