Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
ఈటాటా గ్రూప్ టాటా సన్స్ ఐపీఓగా వస్తుందని చాలా మంది భావించారు. కానీ టాటా గ్రూప్ మాత్రం టాటా సన్స్ ఐపీఓగా తీసుకొచ్చేందుకు ఆసక్తిగా లేదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFC) కోసం అక్టోబర్ 2021 నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. ఈ నిబంధనల ప్రకారం పెద్ద ఎన్‌బిఎఫ్‌సిలు 3 సంవత్సరాలలోపు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కావాలి.
కొత్త నిబంధనల కారణంగా టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ కూడా సెప్టెంబర్ 2025 నాటికి స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావాల్సిందే. అయితే టాటా సన్స్ ఈ లిస్టింగ్‌ను ఎలాగైనా వాయిదా వేయాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కంపెనీ లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు ఆర్‌బీఐని ఆశ్రయించింది. ఐపీఓను వాయిదా వేయడానికి టాటా సన్స్ తన రుణంలో ఎక్కువ భాగాన్ని తిరిగి చెల్లించినట్లు ఆర్బీఐకి తెలిపింది.

దీంతో టాటా సన్స్ ఐపీఓ రాకపోచ్చని తెలుస్తుంది. 2018లో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కుప్పకూలినప్పటి నుంచి ఆర్‌బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆర్‌బిఐ ఎన్‌బిఎఫ్‌సిలను బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్ టాప్ లేయర్‌లుగా విభజించింది. టాటా సన్స్ పై లేయర్ కేటగిరీలో ఉంది. ఈ ఎగువ లేయర్ కేటగిరీ ఎన్‌బిఎఫ్‌సిలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడానికి ఆర్‌బిఐ 3 సంవత్సరాల సమయం ఇచ్చింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం టాటా సన్స్ ఆర్‌బిఐ నుంచి ఉపశమనం పొందకపోతే అది భారతీయ స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద IPO అవుతుంది.
టాటా సన్స్‌లో రతన్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్ 66 శాతం వాటాను కలిగి ఉంది. ఇందులో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్‌కు 18.4 శాతం వాటా ఉంది. పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ వాటా విలువ ప్రస్తుతం దాదాపు రూ.198,000 కోట్లుగా అంచనా వేశారు. ఆర్బీఐ టాప్ 10 NBFCలలో టాటా సన్స్ నాల్గవ స్థానంలో ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం టాటా సన్స్ ఐపీఓగా వస్తే కంపెనీ విలువ రూ. 8 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications