Tata: టాటా గ్రూప్ ట్రబుల్ షూటర్‌కు భారీ ప్యాకేజ్.. వామ్మో, ఏంటి భయ్యా ఆ శాలరీ..
Tata: దేశంలో ఏళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంస్థల్లో టాటా గ్రూపు ఒకటి. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇంత సమర్థవంతంగా నడవడానికి కొందరి అవిశ్రాంత కృషి కారణమని చెప్పవచ్చు. వారిలో ఒకరు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్.
ఇండియాలో అత్యధిక వేతనం పొందుతున్న బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా చంద్రశేఖరన్ కొనసాగుతున్నారు. 2021-22లో 109 కోట్ల వార్షిక వేతనాన్ని ప్యాకేజీగా తీసుకున్నారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూపు గణనీయమైన వృద్ధిని సాధించింది. కంపెనీ ఆదాయం 2017లో 6.37 లక్షల కోట్లు ఉండగా.. అది కాస్తా 9.44 లక్షల కోట్లకు పెరిగింది.

1987లో తిరుచిరాపల్లిలోని రీజనల్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో చంద్రశేఖరన్ మాస్టర్స్ డిగ్రీ పొందారు. అదే ఏడాది TCSలో ఇంటర్న్‌గా చేరారు. ఆయన కృషి ఫలితంగా సెప్టెంబరు 2007లో TCS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించబడ్డారు. రెండేళ్ల తర్వాత 2009లో టాటా గ్రూప్ CEOగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదేకాక 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. 2012-13లో నాస్కామ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, TCS సహా అనేక గ్రూప్ ఆపరేటింగ్ కంపెనీల బోర్డులకు అధ్యక్షత వహిస్తున్నారు. 2022లో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.


Click it and Unblock the Notifications