Chandrashekaran: యూపీఐ చెల్లింపులపై తన అనుభవాన్ని పంచుకున్న చంద్రశేఖరన్..
దేశంలో డిజిటల్ పేమెంట్స్ హవా కొనసాగుతోంది. రూ.5 నుంచి లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. భారత్ యూపీఐ చెల్లింపుల్లో ముందుంది. 2018-2022 మధ్య కాలంలో UPI ద్వారా జరిగిన పేమెంట్స్ విలువ దాదాపు 1,320 శాతం పెరిగింది. అంటే 2018లో 374.63 కోట్ల యూపీఐ చెల్లింపులు జరగ్గా.. 2022 నాటికి ఈ సంఖ్య 7 వేల 404 కోట్లకు పెరిగింది. కొద్ది రోజుల క్రితం ఇండియాను సందర్శించే NRIలు UPI ఉపయోగించి చెల్లింపులు చేసుకోవచ్చని ఆర్బీ పేర్కొంది
తాజాగా డిజిటల్ చెల్లింపులపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడారు. తనకు ఎదురైన ఓ అనుభావాన్ని వివరించారు. ఓ రోజు చంద్రశేఖరన్ ఉదయం వాకింగ్ కు వెళ్లినప్పుడు ఓ చోట కొబ్బరి నీళ్లు తాగాలనిపించిందని చెప్పారు. వెంటనే దుకాణం అతన్ని కొబ్బరి బొండ ఇవ్వమన్నాని పేర్కొన్నారు. కొబ్బరి నీరు తాగిన తర్వాత షాపు యజమాని పైసలు తీసుకునేందుకు సమయం లేదని.. యూపీఐ చేయాలని కొరినట్లు చంద్రశేఖరన్ బీ20 సమ్మిట్ ఇండియా 2023లో చెప్పారు.

దీన్ని బట్టిచూస్తే డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగాయే తెలిసిపోతుందన్నారు. యూపీఐ పేమెంట్స్ లో ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2022 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపులలో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిందని... MyGovIndia జూన్ 10న నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 2022లో ప్రపంచ డిజిటల్ చెల్లింపులలో భారతదేశం 46 శాతం వాటాను కలిగి ఉంది.
బ్రెజిల్ 29.2 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో రెండో స్థానంలో నిలిచింది. 17.6 మిలియన్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో నిలిచింది. 16.5 మిలియన్ల లావాదేవీలతో థాయిలాండ్ నాలుగో స్థానంలో సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా 8 మిలియన్ల లావాదేవీలతో 5వ స్థానంలో నిలిచిందని MyGovIndia నివేదిక పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications