Tata Group: టాటా గ్రూప్ దూకుడుపై చంద్రశేఖరన్ ధీమా.. ఏమన్నారంటే..?
Tata Group: దేశంలోని అతిపెద్ద వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ చేయని వ్యాపారం లేదు అనటం అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం స్టీల్ నుంచి కన్జూమర్ కేర్ ఉత్పత్తుల వరకు ఉన్న అన్ని వ్యాపారాలు చాలా బలంగా కొనసాగుతున్నాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.
గ్రూప్ లోని అనేక వ్యాపారాలకు సంబంధించిన పూర్తి ఫలితాలు విడుదల చేయనప్పటికీ వ్యాపారాలు 20 శాతం మేర వృద్ధి చెందుతాయని వెల్లడించారు. ప్రస్తుతం కన్జూమర్ వ్యాపారంలో మందగమనాన్ని తాము చూడటం లేదని అన్నారు. టైర్- 1,2 నగరాల్లో కంటే టైర్- 3,4 నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నట్లు వెల్లడించారు.

ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై నెగటివ్ వ్యూ ఉంది. అమెరియా, యూరప్ దేశాలు ఇప్పటికే ఆ సెగను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూఎన్ చైనా ప్రచ్చన్న యుద్ధం వంటి కారణాలు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాము వృద్ధిపైనై దృష్టి సారిస్తున్నామని.. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిస్థితులపై కూడా ఓ కన్నేసి ఉంటినట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు.
టాటా గ్రూప్ అవసరం మేరకు కంపెనీలను కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. సెమీకండక్టర్ తయారీ కోసం అవసరమైన కంపెనీలను కొనుగోలు చేస్తామంది. అలాగే అన్ని B2B, B2C కంపెనీలు త్వరలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక శక్తికి మారడంపై దృష్టి సారిస్తాయని చంద్రశేఖరన్ హైలైట్ చేశారు.


Click it and Unblock the Notifications