టాటా మోటర్స్ తమ కొత్త SUV టాటా సియెరా(tata sierra) ని లాంఛ్ చేయంతో మార్కెట్లో టాటా షేర్లు ఊపందుకున్నాయి. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్‌లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) షేర్లు దూసుకుపోయాయి. నిఫ్టీ50 లో అత్యధిక లాభాలు పొందిన వాటిలో ఇదీ ఒకటి. ట్రేడింగ్ మొదట్లో ఏకంగా 2.1 శాతం పెరిగింది. మంగళవారం రూ.352 వద్ద ముగిసిన ఈ షేరు ఉదయం 10:21 గంటల సమయానికి రూ.360 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ పాజిటివ్ వాతావరణానికి ప్రధాన కారణం మంగళవారం టాటా మోటార్స్ విడుదల చేసిన 'టాటా సియెరా'. ఈ SUV ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. రాబోయే కొన్నేళ్లలో టాటా మోటార్స్ SUV మార్కెట్ వాటాను 20-25 శాతం పెంచే శక్తి సియెరాకు ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సియెరా స్పెషాలిటీ ఇదే..
SUV లకు మంచి డిమాండ్ పెరుగుతున్న ఈ రోజుల్లో టాటా సియెరా గేమ్ ఛేంజర్ గా మారింది. రూ. 11.49 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో రిలీజ్ అయిన ఈ SUV ఇప్పటికే మంచి రివ్యూలు అందుకుంటోంది. ఈ కారు డిజైన్ కూడా కొత్తగా ఉండడం చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ కారు బుకింగ్‌లు డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. డెలివరీలు జనవరి 15, 2026 నుంచి మొదలవుతాయి. అయితే టాటా సియెరా కేవలం కొత్త మోడల్ SUV మాత్రమే కాదు ఇందులో అనేక కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.
- ట్రిపుల్ స్క్రీన్ సెటప్: ఒకేసారి మూడు స్క్రీన్‌లను కలిగి ఉన్న తొలి టాటా కారు ఇది. ఇందులో 12.3-అంగుళాల సెంటర్ టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల ప్యాసింజర్ టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి.
- పవర్ ఆడియో సిస్టమ్: సౌండ్‌బార్‌తో కూడిన 12-స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్ ఇందులో ఉంటుంది.
- పనోరమిక్ సన్‌రూఫ్: ఇది అత్యంత పెద్దదైన పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఇంత పెద్ద సన్ రూఫ్ మరే ఇతర ఇండియన్ కార్లకు లేదు.
- అల్ట్రా -స్లిమ్ హెడ్‌ల్యాంప్‌లు: భారతీయ మార్కెట్‌లోనే అత్యంత సన్నని 17 mm -LED హెడ్‌ల్యాంప్‌లు ఇందులో ఉన్నాయి.
- ఎక్స్‌ట్రా సేఫ్టీ: ఆక్సిలరీ టెయిల్‌లైట్ వంటి కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.
- కొత్త ఇంజిన్: సియెర్రాలో ఉన్న 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా కొత్తగా రూపొందించినదే.
టాటా మోటార్స్ ప్లానింగ్ ఇలా.
రాబోయే ఐదేళ్లలో టాటా మోటార్స్ ఏకంగా 30 వరకు కొత్త ప్రొడక్ట్ అప్‌డేట్‌లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా 2030 నాటికి ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగాల్లో రూ.35,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది . అయితే టాటా మోటర్స్ కు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఇటీవల, TMPV షేరు ధర దాని 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) యొక్క బలహీనమైన పనితీరు. అయితే టాటా సియెరా లాంచ్ మాత్రం టాటా మోటార్స్‌కు ఒక గేమ్-ఛేంజర్ కానుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో కంపెనీ వృద్ధిని మరింత బలోపేతం చేయనుంది.


Click it and Unblock the Notifications