Air India: భారత విమానయాన వ్యాపారంలో అగ్రగామిగా నిలవాలని టాటాల గూటికి చేరిన ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దీంతో ఆకాశాన్ని శాసించే స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన విమానాల కొనుగోలుకు భారీ డీల్ కూడా కుదుర్చుకుంది. దీంతో ప్రత్యర్థి కంపెనీల్లో గుబులు మెుదలైందని చెప్పుకోక తప్పదు.

భారీగా పైలట్ల నియామకం..
కొత్త విమానాలను కొనుగోలు చేయటంతో పాటు వాటికోసం దాదాపు 6,500 మందికి పైగా పైలట్లు అవసరమని వెల్లడైంది. ఎయిర్ ఇండియా ప్రకారం 470 విమానాల కోసం వీరిని నియమించుకుంటోంది. కంపెనీ భారీ విస్తరణ ప్రణాళికలో భాగంగా 840 కొత్త విమానాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను కంపెనీ ఆమోదించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 113 విమానాలకు 1600 మంది పైలట్లు ఉన్నారు.

ఇతర సంస్థల్లో..
ఇదే సమయంలో టాటాల ఆధీనంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏషియా ఇండియాలకు ఉన్న 54 విమానాలకు 850 మంది పైలట్లు ఉన్నారు. ఇక విస్తారాలోని 53 విమానాలకు 600 మంది పైలట్లు ఉన్నారు. టాటాలు ఎయిర్ ఇండియాను తిరిగి భారత గగనతలంలో మహారాజాగా మార్చాలని చూస్తున్న విషయం దీనిని బట్టి స్పష్టంగా అర్థమౌతోంది. టాటాల దూకుడును తట్టుకునేందుకు చాలా విమానయాన సంస్థలు సైతం కొత్త విమానాలను కొనుగోలు చేసేందుకు తమ షాపింగ్ మెుదలుపెట్టాయి.

ఇండిగో సీఈవో..
ఇప్పటికే ఇండిగో సంస్థ దాదాపు 500 విమానాలకు ఆర్డర్ పెట్టిందని సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు. ఇందులో దాదాపు 40 విమానాల డెలివరీ 2023లో ఉండవచ్చని తెలిపారు. కంపెనీ రానున్న కాలంలో 10-15 కొత్త రూట్లలో విమానాలను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ.15,410 కోట్లకు చేరుకోగా రూ.1,422.6 రికార్డు లాభాలను ఆర్జించింది.

టాటాల ట్రైనింగ్..
ఎయిర్ ఇండియా ఒక శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించింది. ఇది టాటా గ్రూప్‌కు కొత్త చొరవ. ఎయిర్ ఏషియా ఇండియా మాజీ సీఈవో సునీల్ భాస్కరన్ నేతృత్వంలోని ఈ అకాడమీ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యుత్తమమైనదానికి పోటీగా నిలుస్తుందని ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అవసరమైన స్వదేశీ పైలట్లు, ఇంజనీర్లు, క్యాబిన్ సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ మేనేజర్లతో పాటు ఇతర సిబ్బందిని దేశీయంగా ఈ అకాడమీ తయారు చేయనుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications