Air India విమానాల ఆలస్యాలు, రద్దులు.. లోపల ఏం జరుగుతోందంటే..?
Air India: గగనతలంలో విజయం సాధించాలనుకున్న ఎయిర్ ఇండియాకు కొన్ని ఆటంకాలు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ విమాన సేవలు ఆలస్యం లేదా రద్దుకు అవి కారణమౌతున్నాయి.
విమానయాన సంస్థ ఇబ్బందులకు ప్రధానంగా సిబ్బంది కొరత, ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణ సమస్యలతో గ్రౌండ్ అవుతున్నాయి. దీంతో టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానాలను నడపడంలో ఇబ్బందిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్గాల్లో ఇటీవల 6 విమానాలను రద్దు చేసింది. గత ఆరు వారాల్లో మరో 14 విమానాలను 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడిపినట్లు ఎయిర్‌లైన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఎయిర్ ఇండియా విమానాల రద్దు, ఆలస్యం కారణంగా.. అమెరికా, కెనడా, యూరప్‌లకు నడిపే రూట్లలో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో యూరప్‌లోని వివిధ నగరాలకు నడిపిన తొమ్మిది విమానాలు గత ఆరు వారాల్లో 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యం కాగా మరో మూడు రద్దు చేయబడ్డాయి. జూన్ 6న శాన్ ఫ్రాన్సిస్కోకు 216 ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో ఒక సమస్య తలెత్తడంతో రష్యాలోని మగడాన్‌కు మళ్లించారు. 40 గంటల పాటు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం టాటాలు సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియా అనేక పాత విమానాలను కలిగి ఉంది. అందువల్ల వీటిలో తరచుగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఒక అధికారి వెల్లడించారు. అందుకే టాటాలు భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చారు. ఈ ఏడాది అమెరికా, కెనడా, యూరప్ లకు అధిక డిమాండ్ ఉండటంతో దానిని తీర్చేందుకు కంపెనీ తమ వంతు ప్రయత్నం చేస్తోందని తెలిపారు. అలాగే విమానాలు ఆలస్యంగా రద్దు కావడానికి విడిభాగాల కొరత ప్రధాన కారణమని తెలిపారు.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా మాత్రమే సుదూర ప్రాంతాలకు ఫ్లైట్లను నడుపుతోంది. సిబ్బంది కొరత కారణంగా విమానయాన సంస్థ యుఎస్‌కి వారానికి ఆరు విమానాలను తగ్గించనున్నట్లు మార్చిలో ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు.


Click it and Unblock the Notifications