Tata power: దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా టాటా పవర్ రికార్డు సృష్టించింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దిగ్గజం రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. టాటా స్టీల్ మూడవదిగా నిలిచింది. తద్వారా మొదటి మూడింటిలో రెండు స్థానాలు టాటా గ్రూపు కంపెనీలే కైవసం చేసుకోవడం గమనార్హం. రాండ్ స్టాడ్ ఇండియా పరిశోధన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
'రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (REBR) 2023' పేరిట HR సర్వీస్ ప్రొవైడర్ రాండ్‌స్టాడ్ ఇండియా ఓ పరిశోధన జరిపింది. దాని ప్రకారం ఆర్థిక స్థితి, బ్రాండ్ ఇమేజ్, ఉద్యోగుల కెరీర్ పురోగతి అవకాశాలలో టాటా పవర్ చాలా ఎక్కువ స్కోర్ సాధించింది. 2022లో 9వ ర్యాంక్ తో సరిపెట్టుకోగా ఈ ఏడాది ఏకంగా అగ్రస్థానం కైవసం చేసుకుంది.

టాప్ 10 అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్స్‌లో TCS నాలుగు, మైక్రోసాఫ్ట్, సామ్‌సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్ , టాటా మోటార్స్ , IBM మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన స్టార్టప్ ఎంప్లాయర్ బ్రాండ్‌గా బిగ్ బాస్కెట్ అవతరించింది.
77 శాతంతో ఆటోమోటివ్ రంగాన్ని అత్యంత ఆకర్షణీయమైన రంగంగా ఉద్యోగులు రేట్ చేశారు. IT, ITeS & టెలికాం, FMCG , రిటైల్ & ఈ-కామర్స్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 32 అంతర్జాతీయ మార్కెట్లు, 75 శాతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ రాండ్ స్టాండ్ నివేదిక కవర్ చేసింది. వివిధ దేశాల నుంచి 1.63 లక్షల మందిపై జరిపిన సర్వే ఆధారంగా ఇది రూపొందించబడింది.


Click it and Unblock the Notifications