Tata Power: పవర్ ఫుల్ లాభాలతో టాటా పవర్.. 85% పెరిగిన నికర లాభం.. ఇన్వెస్టర్ల పండగ..
Tata Power: పునరుత్పాదక విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులను అందింపుచ్చుకుంటోంది టాటా గ్రూప్. ఈ రంగంలో ఇప్పటికే అదానీ, అంబానీలు సైతం కీలక ప్లేయర్లుగా ఉన్నారు. తాజాగా కంపెనీ విడుదల చేసిన రెండవ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా నమోదయ్యాయి.

లాభాల పంట..
టాటా పవర్ Q2FY23 బలమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలానికి కంపెనీ ఏకీకృత నికర లాభం 85% పెరిగి రూ.935.18 కోట్లకు చేరుకుంది. పన్నుల తర్వాత నమోదైన నికర లాభం వరుసగా 12వ త్రైమాసికంలోనూ పెరగటం కంపెనీ బలమైన పనితీరుకు అద్ధం పడుతోంది.

భారీగా పెరిగిన ఆదాయం..
రెండవ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 39% పెరిగి రూ.14,181.07 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఈ కాలంలో ఆదాయం రూ.10,187.33 కోట్లుగా ఉంది. అలాగే గత ఏడాది ఇదే కాలంలో రూ.1,732 కోట్లుగా ఉన్న EBITDA.. 18% పెరిగి రూ.2,043 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం ఏడాది క్రితం రూ.9,810 కోట్ల నుండి 49% పెరిగి రూ.14,031 కోట్లకు చేరుకుంది

మెరుగుపడిన పనితీరు..
కంపెనీ పునరుత్పాదక విద్యుత్ సామర్ధ్యంతో జోడింపుతో పాటు పంపిణీ వ్యాపారంలో సామర్థ్యాలను పెంచుకోవటం కంపెనీకి మంచి ఆదాయాలను తెచ్చిపెడుతోంది. ఒడిశాతో పాటు ఇతర ప్రాంతాల్లో కంపెనీ ఉత్పాదక యూనిట్లలో జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ పనితీరు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ వెల్లడించింది.

ఆనందంలో ఇన్వెస్టర్లు..
కంపెనీ వరుసగా మెరుగైన పనితీరు కనబరచటం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. 1911లో స్థాపించబడిన టాటా పవర్ ఇప్పుడు ఎక్కువగా సోలార్ వంటి పునరుత్పాదక ఇంధన తయారీపై దృష్టి సారించింది. శుక్రవారం స్టాక్ రూ.225.30 వద్ద ముగిసింది. ఈ కంపెనీ గడచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 167 శాతం రాబడిని అందించింది. అయితే ఏడాది కాలాన్ని పరిశీలించనట్లయితే స్టాక్ కన్సాలిడేటెడ్ స్టేట్ లో కొనసాగుతోంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.190 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.298.05 గా ఉంది.


Click it and Unblock the Notifications