Tata Power: రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో అనేక కంపెనీల నుంచి పెట్టుబడులు ఏపీకి మళ్లుతున్నాయి. అనుకూలమైన వ్యాపార వాతావరణంతో పాటు అవకాశాలు దీనికి దోహదం చేస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఏపీ ప్రభుత్వం మధ్య 7 గిగావాట్ పునరుత్పత్తి ఎనర్జీ ప్రాజెక్టుల అభివృద్దికి అంగీకార ఒప్పందం జరిగింది.
ఈ మెగా ప్రాజెక్టులో టాటా గ్రూప్ రూ.49 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. సోలార్, విండ్, హైబ్రిడ్ ప్రాజెక్టులతో పాటు ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలకు ఉన్న అవకాశాలను అన్వేషించబడుతున్నాయి. అంచనా వేసిన పెట్టుబడులు రూ.49,000 కోట్లు కావటంతో ఇది ఏపీలో అతిపెద్ద పునరుత్పత్తి ఎనర్జీ పెట్టుబడులలో ఒకటిగా మారనున్నది. రాష్ట్రానికి ఎనర్జీ రంగంలో శుభం కావడం, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ ప్రయోజనాల కలిగించడం కోసం ఈ ఒప్పందం ముఖ్యమైనదిగా నిలుస్తుంది.

ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీనర్ ఎనర్జీ పాలసీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం 160 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ ద్వారా మెుత్తం రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులతో పాటు దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టి ద్వారా రాష్ట్రానికి మేలు జరగనుంది. తాజా ఒప్పందం ప్రకారం టాటాలకు అవసరమైన పునరుత్పత్తి విద్యుత్ ప్రాజెక్టుల స్థలాల గుర్తింపు, ఫీజిబిలిటీ అధ్యయనాలు అభివృద్ధి పనులను చేపట్టనున్నది. ఈ ప్రాజెక్టుల అభివృద్ధి క్రమంలో న్యూ అండ్ రీన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవసరమైన సహాయాన్ని అందించనుంది. ఇది స్థలాల గుర్తింపు, సైట్ సదుపాయాల ఏర్పాటు, విద్యుత్ అవకాసం నిర్మాణం వంటి సహాయ చర్యలకు బాధ్యత వహిస్తుంది.
ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చడంతో పాటు, స్థానిక సామర్థ్యాభివృద్ధి, నైపుణ్యాల పెంపు, జీవనాధారాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇంత పెద్ద స్థాయి పునరుత్పత్తి విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి, భారతదేశంలోని పర్యావరణ నిబంధనలకి అనుగుణంగా సుస్థిరమైన, గ్రీన్ ఎనర్జీ వనరుల వినియోగాన్ని పెంచడం కోసం కీలకమైంది. దీని ద్వారా పునరుత్పత్తి విద్యుత్ రంగంలో ఏపీ మరో కొత్త దశలోకి అడుగుపెట్టనుంది.
టాటా గ్రూప్ కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టు ప్రభావం సోమవారం కంపెనీ షేర్లపై కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే టాటా పవర్ అదానీ పవర్ కంపెనీతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ దిగ్గజాలు దేశ ఎనర్జీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications