టాటా నెక్సాన్ కొనాల్సిన అవసరం లేదు, నెలకు అద్దె రూ.34,900: 100 మందికి మాత్రమే..
టాటా మోటార్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ SUV నెక్సాన్ అద్దెకు లభించనుంది. స్వల్పకాలం పాటు అమలులో ఉండనున్న ఈ కారుపై నెలకు అన్ని కలుపుకొని రూ.34,900 అద్దె వసూలు చేస్తుంది. నవంబర్ 30వ తేదీ వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల కాలపరిమితితో మొదటి వంద కస్టమర్లకు మాత్రమే అందిస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరులలో ఈ సేవలు అందిస్తుంది. ఇటీవల ఇతర సంస్థలు కార్లను అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

బీమా కవరేజీ.. ఇంటి వద్ద వాహన చార్జర్
విద్యుత్ ఎస్‌యూవీ నెక్సాన్‌కు పరిమిత కాల సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌లో నెలకు రూ.34,900 ఫిక్స్డ్ అద్దె చెల్లించి కస్టమర్ వాహనాన్ని లీజుకు తీసుకోవచ్చు. 12, 24 36 నెలల కాలపరిమితులకు అద్దెకు దక్కించుకున్న కస్టమర్లు సబ్‌స్క్రిప్షన్ కాలవ్యవధి ముగిసిన తర్వాత వినియోగదారులు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. లేదా ఆ తర్వాత వాహనాన్ని వెనక్కి ఇవ్వవచ్చు. సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీలో బీమా కవరేజీ, ఆన్-కాల్ 24X7 రోడ్ సైడ్స్ అసిస్టెన్స్, ఉచిత నిర్వహణ, ఇంటికి డెలివరీ వంటివి ఉన్నాయి. పర్సనల్ విద్యుత్ వాహన చార్జర్‌ను ఇంటి వద్ద లేదా ఆఫీస్ వద్ద ఇన్‌స్టాల్ చేసే సౌలభ్యాన్ని కల్పిస్తోంది.

ఆఫర్లు..
పండుగ సీజన్‌లో కంపెనీలు వివిధ రకాల డిస్కౌంట్లు, తగ్గింపు ధరలను ప్రకటించడం తెలిసిందే. బిజినెస్‌ను పెంచుకోవడానికి కంపెనీలు ఇలా ఆఫర్లు ఇస్తాయి. అన్నింటిని కలుపుకొని రెంట్ ఉంటుంది. అలాగే వాహనదారులకు ఎలాంటి వాహన యాజమాన్యం పరంగా ఉంటే ఇబ్బందులు ఉండవు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్, మెయింటెనెన్స్ కలిపి ఉంటుంది. సరసమైన, అనుకూల, పర్యావరణసహిత నెక్సాన్ ఈవీ డ్రైవింగ్ కారు కోరుకునే వారికి ఇది ప్రయోజనకరం.

టాటా నెక్సాన్ ఈవీ సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీ
- సమగ్ర బీమా సౌకర్యం
- ఆన్-కాల్ 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్
- ఫ్రీ మెయింటెనెన్స్, డోర్ స్టెప్ డోలివరీ
- కాంప్లిమెంటరీ పర్సనల్ ఈవీ చార్జర్ సౌకర్యం. ఇంటి వద్ద లేదా కార్యాలయం వద్ద.
- కస్టమర్ తన పదవీ కాలం ముగిసిన అనంతరం పొడిగించుకునే వెసులుబాటు.
- కేవలం మొదటి 100 మంది వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్.


Click it and Unblock the Notifications