Tata Won: దేశంలో టాటా గ్రూప్ అనేక ప్రతిష్ఠాత్మకమైన వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రతన్ టాటా ఫోకస్ ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాలపైనే ఎక్కువగా ఉంది.
మధ్య తరగతి ప్రజల ప్రయాణాల కోసం నానో పేరుతో బడ్జెట్ కారును దేశంలో రతన్ టాటా ప్రవేశపెట్టారు. అయితే దీనికి సంబంధించిన ఉత్పత్తి కర్మాగారాన్ని పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏర్పడిన వివాదంతో తర్వాత దానిని మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ రాష్ట్రానికి తరలించిన సంగతి తెలిసిందే. దీనికోసం అప్పట్లో ఫ్యాక్టరీని పూర్తిగా విడదీచి దాదాపు 2,000 ట్రక్కుల్లో గుజరాత్‌కు తరలించారు.

2008లో భూసేకరణను స్థానిక ప్రజలు వ్యతిరేకించటంతో జరిగిన నిరసనలతో టాటాలు సింగూప్ ప్లాంట్ తరలించారు. దీనికి సంబంధించి దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వివాద పరిష్కారంలో టాటా మోటార్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(WBIDC) నుంచి రూ.766 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డును గెలుచుకుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ఉత్పత్తి కోసం టాటా మోటార్స్ ప్రణాళికల్లో భాగంగా కర్మాగారం వాస్తవ ప్లానింగ్ జరిగింది.
మధ్యవర్తిత్వ ధర్మాసనం WBIDCని 11% రేటు వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. సెప్టెంబర్ 2016 నుండి ప్రారంభించి.. నిధుల వాస్తవ రికవరీ వరకు వడ్డీ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ లెక్కన టాటా మోటార్స్ రూ.765.78 కోట్లతో పాటు ప్రొసీడింగ్ ఖర్చుల కింద రూ.కోటి పొందనుంది. 2000వ దశకం ప్రారంభంలో లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టాటా మోటార్స్ కోసం కార్ల ఫ్యాక్టరీని నిర్మించేందుకు సింగూర్‌లో 1,000 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని సేకరించేందుకు ప్రణాళికలను ప్రకటించినప్పుడు వివాదానికి కారణమైంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మమతా బెనర్జీతో సహా చాలా మంది స్థానిక రైతులు, రాజకీయ నాయకులు అప్పట్లో భూసేకరణను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications