ఇక ఎవరి దారి వారిదే: టాటా మోటార్స్ సంచలనం: జాయింట్ వెంచర్ నుంచి బయటికి
న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగంలో తిరుగులేని సంస్థగా ఆవిర్భవించిన టాటా మోటార్స్ లిమిటెడ్.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తన జాయింట్ వెంచర్ కంపెనీ మార్కోపోలో నుంచి వైదొలగబోతోంది. మార్కోపోలో ఎస్ఏ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తన వాటా మొత్తాన్ని 99.96 కోట్ల రూపాయలకు కొనుగోల చేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రెగ్యులేటరీకి పంపించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.
టాటా మోటార్క్స్-మార్కోపోలో ఎస్ఏ కంపెనీలు 2006లో జాయింట్ వెంచర్‌గా ఏర్పడ్డాయి. టాటా మార్కోపోలో మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎంఎల్)గా ఆవిర్భవించాయి. ఇందులో టాటా మోటార్స్ వాటా 51 శాతం, మార్కోపోలో వాటా 49 శాతంగా నిర్థారించాయి.

భారీ వాహనాలు.. ప్రత్యేకించి- బస్సుల తయారీలో ఈ సంస్థ అద్బుత ప్రగతిని కనపరిచింది. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ (జెఎన్ఎన్‌యుఆర్ఎం) కింద రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 70 శాతానికి పైగా ఈ బస్సులను కొనుగోలు చేశాయి. లో-ఫుట్‌బోర్డు బాడీ బిల్డింగ్‌కు అనుకూలంగా ఛాసిస్‌లను తయారు చేశాయి.
తాజాగా- ఈ జాయింట్ వెంచర్ నుంచి వైదొలగాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. దీనితో టాటా మార్కోపోలో మోటార్స్ లిమిటెడ్ భవిష్యత్తులో ఉండదు. భాగస్వామ్యాన్ని తెంచుకోవాలని మార్కోపోలో కంపెనీ నిర్ణయించుకుందని, దీనికి తమ బోర్డు అంగీకారం తెలిపిందని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. మార్కోపోలో కంపెనీ తన వాటాను జాయింట్ వెంచర్ కంపెనీకి మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఆ నిబంధనల ప్రకారం.. తాము మార్కోపోలో కంపెనీకి చెందిన 49 శాతం వాటా మొత్తాన్ని 99.96 కోట్ల రూపాయలను కొనుగోలు చేయనున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. కర్ణాటకలోని ధార్వాడ, ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోల్లో ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి వాహన ఛాసిస్‌ల తయారీ యూనిట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అక్కడి నుంచే ఛాసిస్‌లను సరఫరా చేస్తోంది. ఇక ముందు కూడా ఈ రెండు తయారీ యూనిట్లు యధాతథంగా పని చేస్తాయని, అవి పూర్తగా తమ ఆధీనంలోనే ఉంటాయని టాటా మోటార్స్ వెల్లడించింది. మార్కోపోలో కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదని వివరించింది.


Click it and Unblock the Notifications