Buzzing Stock: మార్కెట్లో Tata Motors స్టాక్ రికార్డులు.. అసలు కారణం ఏమిటంటే..
Tata Motors: దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా మోటార్స్ కంపెనీ షేర్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. కంపెనీ షేర్లు ఆరేళ్ల గరిష్ఠానికి చేరుకోవటంతో ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు.
కంపెనీ షేర్ల పెరుగుదలకు గుజరాత్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో దేశంలో దూసుకుపోతున్న టాటా మోటార్స్.. సొంత అవసరాల కోసం లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.13,000 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు గుజరాత్ విజయ్ రూపానీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవటంతో స్టాక్ లాభపడుతోంది.

టాటా మోటార్స్ స్టాక్ ఈ క్రమంలో 52 వారాల గరిష్ఠాలను తాకింది. బ్యాటరీల తయారీ ప్లాంట్ ఏర్పాటు వల్ల పరోక్షంగా టాటా మోటార్స్ కంపెనీకి, ప్రత్యక్షంగా టాటాల ఎలక్ట్రిక్ కార్ల తయారీకి దోహదపడటంతో షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. గత ఏడాది డిసెంబరు 26న కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ.375.5ని చేరుకుంది. అయితే తాజా పెరుగుదలల నేపథ్యంలో టాటా మోటార్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.2 లక్షల కోట్లకు సమీపానికి చేరుకుంది.
స్వాతంత్య్రానికి ముందు 1945లో జేఆర్డీ టాటా దేశ రవాణా అవసరాలను తీర్చేందుకు ముందుచూపుతో కంపెనీని ప్రారంభించారు. మధ్యాహ్నం 1.53 గంటల సమయంలో స్టాక్ 2.33 శాతం మేర లాభపడి ఎన్ఎస్ఈలో రూ.548.30 వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.375.20 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.548.75గా ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో టాటా మోటార్స్ తాజా గరిష్ఠాన్ని చేరుకుంది.


Click it and Unblock the Notifications