Tata Motors Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు టాటా మోటార్స్ స్టాక్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 9 శాతానికి పైగా పతనం కావటంతో మార్కెట్ సూచీలు సైతం భారీ నష్టాలను నమోదు చేశాయి.
వాస్తవానికి తాజాగా టాటా మోటార్స్ విడుదల చేసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఏడాది ప్రాతిపదికన లాభాలు మూడింతలయ్యాయి. కంపెనీ ఫలితాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచినప్పటికీ.. మార్కెట్లోని ఇన్వెస్టర్లు కంపెనీ భవిష్యత్తు అమ్మకాలపై ఆందోళవ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేడు మార్కెట్ల ప్రారంభం నుంచి టాటా మోటార్స్ స్టాక్ 10 శాతం మేర పతనమై ఇంట్రాడేలో షేరు ధర రూ.950 స్థాయికి పడిపోయింది. జనవరి-మార్చి త్రైమాసిక కాలంలో టాటా మోటార్స్ ఏడాది ప్రాతిపదిన నికర లాభం 222 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.17,407 కోట్లకు చేరుకుంది.

అమ్మకాల పెరుగుదల, ముడి సరుకుల ధరలు, ఉత్తమ పనితీరు వంటి అంశాలు నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కీలక పాత్ర పోషించినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో త్రైమాసిక కాలంలో కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోల్చితే 13 శాతం పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు చేరుకుంది. కంపెనీ అత్యుత్తమ పనితీరు కనబరిచినప్పటికీ దలాల్ స్ట్రీట్‌లో ట్రేడర్లను ఆకట్టుకోవటంలో విఫలమైందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కంపెనీ వద్ద నగదు నిల్వలు మెరుగుపడటంతో పాటు అప్పులు తగ్గాయి. 12.38 గంటల సమయంలో టాటా మోటార్స్ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో 8.22 శాతం నష్టపోయి రూ.960 రేటు వద్ద కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో కంపెనీ షేర్లపై బ్రోకరేజ్ కంపెనీల అభిప్రాయాన్ని పరిశీలిస్తే.. జేపీ మోర్గన్ టాటా మోటార్స్‌పై బులిష్‌గా ఉంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను తాజాగా రూ.1,115కి పెంచింది. మరో బ్రోకింగ్ సంస్థ జెఫరీస్ టాటా షేర్లపై BUY రేటింగ్ అందిస్తూ భవిష్యత్తు టార్గెట్ ధరను రూ.1,250గా ప్రకటించింది. ఇదే క్రమంలో JLR డిమాండ్ ప్రమాదాన్ని ఎదుర్కోగలదని అంచనా వేసినందున నోమురా స్టాక్‌ను BUY రేటింగ్ నుంచి 'neutral'కి తగ్గించింది. ఇదే క్రమంలో జాగ్వార్ లాండ్ రోవర్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తే అవి టాటా మోటార్స్ మార్జిన్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందనే దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. టాటా మోటార్స్ షేర్లు 2023లో నిఫ్టీలో 100 శాతానికి పైగా లాభపడి ఉత్తమ పనితీరును కనబరిచాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications